తెలుగు తెరపై వెలిగి.. ఆశేష అభిమానులను సంపాదించుకున్న మహానటి కీర్తి సురేశ్. తెలుగులో పాటు వివిధ భాషల్లో అగ్ర తారగా కొనసాగుతోంది. ఈ సుందరి ప్రస్తుతం ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
తెలుగులో నేచురల్ స్టార్ నానితో 'దసరా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కీర్తి సురేశ్. అందులోని ఓ పాట దసరా ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయింది. ఆ పాటకు.. కీర్తి మోకాళ్ల దాకా లుంగీ కట్టి.. బీటుకు తగ్గట్టుగా ఆడింది. దీంతో కుర్రకారు హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతోంది అనడం అతిశయోక్తి కాదు. అంత గ్రేస్‌ఫుల్‌గా డ్యాన్స్ ఇరగదీసింది.
తెలుగు సినిమాల్లోకి డీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్.. మొదట క్లాస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించింది. టాలీవుడ్లో హీరోయిన్లలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల అందాల ఆరబోత మొదలు పెట్టింది. చివరి సారిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించింది. గతంలో తను నటించిన అన్ని చిత్రాల కంటే ఈ మూవీలో ఎక్కువగానే గ్లామర్ షో చేసింది ఈ చిన్నది. ఈ సినిమా నుంచి కొత్తగా కనిపిస్తోంది కీర్తి.