Karthikeya2 Movie One Week Collections: 'కార్తికేయ 2' మూవీ హిందీ వెర్షన్ విడుదలైన రోజున ఉత్తరాది ప్రేక్షకులకు ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు. కేవలం 50 స్క్రీన్‌లలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఇప్పుడు ఆ స్క్రీన్ కౌంట్ ఎంతో తెలుసా? సుమారు వెయ్యికు పైగానే! దీన్ని బట్టి ఉత్తరాదిలో నిఖిల్ సిద్ధార్థ సినిమాకు ఎటువంటి ప్రేక్షకాదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వసూళ్ల పరంగానూ సునామీ సృష్టిస్తోంది కార్తికేయ 2. బాలీవుడ్ స్టార్‌హీరోలు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా', 'రక్షాబంధన్' మూవీలను వెనక్కి నెట్టేసి ఈ సినిమా అటు నార్త్ ఇటు సౌత్ ప్రేక్షకులను అలరిస్తోంది.
రోజురోజుకూ బీటౌన్లో 'కార్తికేయ 2' మూవీ కలెక్షన్లు పెరుగుతున్నాయి. మొదటి రోజు ఏడు లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా, ఏడో రోజున రూ. 2.46 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక..రెండో రోజు రూ. 28 లక్షలు, మూడో రోజు రూ. 1.10 కోట్లు, నాలుగో రోజు రూ. 1.28 కోట్లు, ఐదో రోజు రూ. 1.38 కోట్లు, ఆరో రోజు రూ. 1.64 కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద వారంలో రూ. 8.20 కోట్లు వసూలు చేసింది. మరో వారం రోజులు హిందీ మార్కెట్‌లో 'కార్తికేయ 2'కు ఇదే విధంగా వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల వారం కలెక్షన్స్ రూ. 29.55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటకలో రూ.1.64 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.3.25 కోట్లు, హిందీలో రూ.4.45 కోట్లు వసూలు చేసింది.
100 కోట్ల రేసులో కార్తికేయ2..బాలీవుడ్‌లో ఈ సినిమాకు బంపర్ కలెక్షన్స్ రావడం వల్ల 'కార్తికేయ 2' తొలి వారంలో ఈజీగా హాఫ్ సెంచరీ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో రూ.60.12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమా నిర్మాణ వ్యయం, విడుదలైన పరిస్థితులు చూస్తే.. 'కార్తికేయ 2' సూపర్ డూపర్ సక్సెస్ అనే చెప్పాలి.