తనకు అగ్ర కథానాయకుడు నాగార్జున అంటే చాలా ఇష్టమని ఆయనతో ఓ పోలీస్ కథపై చర్చలు జరుపుతున్నానని దర్శకుడు చందూ మొండేటి అన్నారు. నాగార్జునతో 'విక్రమ్'లాంటి పవర్‌ఫుల్ స్టోరీతో సినిమా చేస్తానని చెప్పారు. చందూ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన చిత్రం 'కార్తికేయ2'. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నిఖిల్‌తో కలిసి చందూ మొండేటి ఆలీ షోకు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన సరదా ప్రశ్నలకు అంతే ఫన్నీగా జవాబులు చెప్పారు.
'విక్రమ్' రేంజ్లో నాగార్జున కొత్త సినిమా.. దర్శకుడు అతడే! - nikhil karthikeya 2
ఆలీతో సరదాగా కార్యక్రమానికి 'కార్తికేయ 2' టీమ్ విచ్చేసి సందడి చేసింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో దర్శకుడు చందూ మొండేటి.. సీనియర్ హీరో నాగార్జనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనతో చేయబోయే సినిమా గురించి కూడా మాట్లాడాడు.
'నువ్వొక చిన్న సైజు విజయ్‌మాల్య అట కదా' అని చందూను అడగ్గా, 'స్కాములా.. దొంగతనం కూడా చేశామంటారు..' అని నవ్వులు పూయించారు. 'అదంతా ఒకప్పుడు' అంటూ నిఖిల్ అన్నారు. 'కార్తికేయ2’లో చాలా పాములు ఉంటాయని చెప్పారు. 'భార్యలకు అబద్ధాలు చెప్పకపోతే, ఇన్ని కాపురాలు ఉంటాయా' అంటూ చందూ చెప్పగా, 'చిరాగ్గా ఉన్న సమయంలో ఫోన్ చేసి.. డు యు లవ్ మీ' అని అడుగుతారని నిఖిల్ చెప్పడంతో నవ్వుల పువ్వులు విరిశాయి. ఆగస్టు 8న ఈ షో టెలికాస్ట్ కానుంది.
ఇదీ చూడండి: DSP Birthday: ఆ పాట కోసం దేవీశ్రీ ప్రసాద్ తొలిసారి అలా చేశారట