తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నిఖిల్ 'స్పై'కి కలిసొచ్చే అంశాలెన్నో.. మరి టార్గెట్​ అందుకుంటుందా?

Nikhil siddharth spy movie : నిఖిల్ 'స్పై' మూవీ ప్రీ రిలీజ్​ బిజినెస్​ బాగానే జరిగినట్లు తెలిసింది. ఆ వివరాలు..

నిఖిల్ 'స్పై'కి కలిసొచ్చే అంశాలెన్నో.. మరి టార్గెట్​ అందుకుంటుందా?
నిఖిల్ 'స్పై'కి కలిసొచ్చే అంశాలెన్నో.. మరి టార్గెట్​ అందుకుంటుందా?

By

Published : Jun 27, 2023, 5:26 PM IST

Nikhil siddharth spy movie :యంగ్ హీరో నిఖిల్​ నటించిన యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా 'స్పై'. పాన్​ ఇండియా స్థాయిలో మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో క్లారిటీగా తెలీదు కానీ.. మొదటి రోజు పాజిటివ్​ మౌత్ టాక్​తో కలెక్షన్లు ఊపందుకుంటాయనే నమ్మకం మాత్రం మూవీటీమ్​లో కనిపిస్తోంది. తెలుగులో ఈ చిత్రం రిలీజ్ రోజు.. శ్రీవిష్ణు సామజవరగమన మాత్రమే పోటీగా ఉంది. కాబట్టి 'స్పై' చిత్రానికి వచ్చే టెన్షన్​ ఏమీ లేదు. ఇప్పటికే ఎలాగో 'ఆదిపురుష్'​ స్లో అయిపోయింది.

ఇక నార్త్​లో విషయానికొస్తే.. అక్కడ బాలీవుడ్​ యంగ్ హీరో కార్తిక్​ ఆర్యన్​ నటించిన 'సత్యప్రేమ్​ కి కథ' సినిమా కూడా స్పై రోజునే(జూన్​ 29) రిలీజ్ కానుంది. కాబట్టి అక్కడ కాస్త పోటీ నెలకొంది. అయినప్పటికీ ఇప్పటికే 'కార్తికేయ 2'తో నిఖిల్​ అక్కడ కూడా ఆడియెన్స్​లో గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి నిఖిల్​ సినిమా చూసేందుకు అక్కడి వాళ్లు రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ 'స్పై' చిత్రానికి బిజినెస్ బాగానే జరిగినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ హక్కులను రూ.17.50కోట్లకు విక్రయించినట్టు సమాచారం అందింది. అంటే బ్రేక్ ఈవెన్​ టార్గెట్​ రూ.19కోట్లు. నిఖిల్ కెరీర్​లో ఇదే హైయెస్ట్​ బ్రేక్ ఈవెన్ టార్గెట్​. ఆంధ్రాలో రూ. 6 కోట్లు, నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్ రూ.2 కోట్లు, ఓవర్సీస్​లో రూ.1.75కోట్లు, ఇతర రాష్ట్రాలు రూ.70 లక్షలకు విక్రయించారని బయట లెక్కలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి కలిసి వస్తున్న సానుకూలంశాలు చాలానే ఉన్నాయి. మొదటిది ఈ సినిమా రిలీజ్ డేట్​. 29న బక్రీద్ పండగ. నేషనల్ హాలిడే. ఆ తర్వాత మూడు రోజుల లాంగ్ వీకెండ్. ఇక నెలలోని చివరి శనివారం కావడం వల్ల బ్యాంకుల లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవులు ఉంటాయి. ఇక​ రిలీజ్​ రోజు పాజిటివ్ టాక్ వస్తే చాలు.. తక్కువ సమయంలోనే అనుకున్న టార్గెట్​ కలెక్షన్లను దక్కించుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

spy movie story : 'స్పై' చిత్ర కథ విషయానికొస్తే.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవితానికి సంబంధించి ఎప్పుడూ వినని అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు అంటున్నారు నిఖిల్‌. ఆర్యన్‌ రాజేశ్‌, ఐశ్వర్య మేనన్‌, సన్యా ఠాకూర్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్‌ దర్శకత్వం వహించారు. కె.రాజశేఖర్‌రెడ్డి కథను సమకూర్చడంతో పాటు, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై స్వయంగా నిర్మించారు.

ఇదీ చూడండి :

నిఖిల్ చేతిలో 'సెంగోల్​'.. ఈ యంగ్ హీరో టార్గెట్​ వారేనా!

'స్వాతంత్ర్యం ఒకరిచ్చేది కాదు.. లాక్కోవాలి'.. బోస్ మాటలతో నిఖిల్ 'స్పై' ట్రైలర్.. రానా స్పెషల్ రోల్

ABOUT THE AUTHOR

...view details