ఎలాంటి సినీనేపథ్యం లేకుండా టాలీవుడ్లో రాణించిన కథానాయకుల జాబితా తిరగేస్తే అందులో ఈ యంగ్ హీరో పేరు ఉంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఇతడు.. కెరీర్లో ఒడుదొడుకులు ఎదురైనా చక్కని కథల్ని ఎంచుకుంటూ హీరోగా ఎదుగుతున్నాడు. ఈ వారంలో అతడు నటించిన కొత్త సినిమా భారీ అంచనాలతో దేశవ్యాప్తంగా రిలీజ్ కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన త్రోబ్యాక్ చిన్ననాటి ఫొటో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. కింద కనిపిస్తున్నది ఆ ఫొటోనే. మరి ఇందులో వాళ్ల అమ్మ పక్క కూర్చున్న ఈ క్యూట్ చిన్నోడు.. ఎవరంటే? యంగ్ హీరో నిఖిల్.
నిఖిల్.. నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వంలో అతడు నటించిన 'కార్తికేయ' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేసిన మరో మిస్టరీ థ్రిల్లరే 'కార్తికేయ2'. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ద్వారకలో దాగిన రహస్యం ఏంటి? దాన్ని కార్తికేయ ఎలా కనిపెట్టాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!