తమిళ స్టార్ హీరో కార్తి ప్రస్తుతం 'పొన్నియిన్ సెల్వన్' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే 'సర్దార్'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన.. తన దర్శకత్వ ఆలోచనల గురించి చెప్పారు. భవిష్యత్లో దర్శకుడిగా మారాలని భావిస్తున్నట్లు తెలిపారు.
దర్శకుడిగా మారనున్న హీరో కార్తి.. అన్నయ్యతో సినిమా? - karthi sardar movie
త్వరలోనే దర్శకుడిగా మారి తన అన్నయ్య హీరో సూర్యతో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు కథానాయకుడు కార్తి. తన కెరీర్ ఎలా ప్రారంభమైందో గుర్తుచేసుకున్నారు.
మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ ఎలా ప్రారంభమైందో గుర్తుచేసుకున్నారు. 'మీరు ఏ హీరో సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటున్నారు' అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ "నేను మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా కెరీర్ ప్రారంభించింది మా అన్నయ్య సూర్య నటించిన సినిమాతోనే. నేను దర్శకత్వం వహించే తొలి సినిమాలో ఆయనే హీరోగా ఉంటారు. ఎందుకంటే తను నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నా చెయ్యి పట్టుకొని చిత్ర పరిశ్రమలోకి తీసుకువచ్చాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే నాకు మా అన్నయ్య నటించే సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది" అని చెప్పారు.
ఇదీ చూడండి:పిల్లి కళ్ల భామకు పెళ్లి కళ.. చారిత్రక కోటలో వివాహం.. వరుడు ఎవరంటే?