Karthi Japan Movie : 'ఖైదీ', 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలతో అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు తమిళ నటుడు కార్తి. తన నెచురల్ యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను అలరించే ఈ స్టార్ హీరో.. తాజాగా 'జపాన్' అనే కొత్త సినిమాతో థియేటర్లలోకి వచ్చారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదలైంది. కార్తి మీద ఉన్న అంచనాలతో పాటుస ప్రమోషన్ల ద్వారా ఇచ్చిన హైప్ వల్ల ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. కానీ రెండు భాషల్లోనూ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. దీంతో అటు మూవీ మేకర్స్‌తో పాటు ఇటు కార్తి ఫ్యాన్స్ డీలా పడ్డారు.
నవంబర్ 10న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. కార్తి చేసిన జపాన్ క్యారెక్టరైజేషన్‌కు ఫ్యాన్స్ కనెక్ట్ అయినప్పటికీ.. రొటీన్ స్క్రీన్ ప్లే, డ్రామా లాంటి అంశాల వల్ల మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొద్ది రోజుల పాటు మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమా ఇప్పుడు కలెక్షన్ల పరంగానూ డీలా పడింది. ఈ క్రమంలో 'జపాన్'కు కేటాయించిన స్క్రీన్లలో ఇప్పుడు కొత్త సినిమాలను వేస్తున్నారు.
మరోవైపు కార్తి 25గా తెరకెక్కిన 'జపాన్' మూవీ అతని కెరీర్లో ఓ మైల్ స్టోన్‌లా కాకుండా ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మారిందని సమాచారం. మంచి కథలు ఎంచుకొని సినిమాలు చేసే కార్తి.. 'జపాన్' విషయంలో మాత్రం ఆయన తన క్యారెక్టర్ నచ్చి చేశారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. తనవంతు కృషితో క్యారెక్టర్లో లీనమై డిఫరెంట్‌గా యాక్ట్ చేశారు. కానీ ఊహించని ఫలితంతో ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించాలేకపోయింది.