తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నాగచైతన్య మూవీటీమ్​పై దాడి.. గుడి దగ్గర ఆ పని చేశారని - నాగచైతన్య కర్ణాటకలో షూటింగ్​

యంగ్​ హీరో నాగ చైతన్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్​ ప్రస్తుతం కర్ణాటకలోని ఓ చారిత్రక గుడిలో జరుగుతోంది. అయితే అక్కడి స్థానికులు ఆ చిత్రీకరణను అడ్డుకున్నారని తెలిసింది. ఎందుకంటే..

attack on Nagachaitanya movie team
నాగచైతన్య మూవీటీమ్​పై దాడి.. గుడి దగ్గర ఆ పని చేశారని

By

Published : Oct 9, 2022, 4:00 PM IST

టాలీవుడ్​ డీసెంట్​ హీరోగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య గురించి తెలిసిందే. సినిమాలు, ప్రమోషన్లు, కెరీర్ ​చూసుకోవడం తప్ప ఎలాంటి వివాదాల జోలికి వెళ్లరు. కాంట్రవర్సీ విషయాలకు దూరంగా ఉంటారు. ఇటీవల లాల్ సింగ్ చద్ధా, థ్యాంక్యూ మూవీస్​ రిజల్ట్​తో కాస్త డల్​ అయినా.. వరుస సినిమాల షూటింగ్​లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి వెంకట్​ ప్రభుతో చేస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్​ ప్రస్తుతం కర్ణాటకలోని మేలుకోతే గుడి ప్రాంతంలో జరుగుతోంది. ఆ చారిత్రక దేవాలయంలోనూ పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఆ గుడి పరిసర ప్రాంతంలో ఓ బార్​ సెట్​ను వేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అక్కడి స్థానికులు అలా సెట్​ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారట. అలా ఈ క్రమంలోనే చిత్ర యూనిట్​తో వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. కాగా, నాగచైతన్య ప్రస్తుతం వెంకట్​ ప్రభు సినిమాతో పాటు దూత అనే వెబ్​సిరీస్​ కూడా చేస్తున్నారు.

ఇదీ చూడండి:'పుష్ప 2' కేశవ లుక్​ లీక్​.. విలన్​గా మారనున్నాడా?

ABOUT THE AUTHOR

...view details