తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆలియా భట్​ ప్రెగ్నెంట్ అని తెలిసి.. కన్నీరు పెట్టుకున్న కరణ్​ జోహార్​ - karan johar on alia bhatt becoming mom

బాలీవుడ్​లో ఆలియా భట్​- కరణ్​జోహార్​ బంధం చాలా ప్రత్యేకమైంది. రణ్​బీర్​ కపూర్​- ఆలియా భట్​ పెళ్లికి కరణ్​ ఎంత సందడి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పెళ్లి జరిగిన రెండు నెలలకే ఆలియాకు ప్రెగ్నెన్సీ నిర్దరణ అయ్యింది. అయితే ఈ విషయం తెలియగానే కరణ్​ ఏడ్చేశారట. ఆయన ఎందుకు ఎలా చేశారు? అసలైమంది?

Karan Johar-Alia Bhatt
ఆలియా భట్​- కరణ్​ జోహార్​

By

Published : Jul 6, 2022, 7:36 PM IST

బాలీవుడ్​ బడా నిర్మాత కరణ్​ జోహార్​ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న..'కాఫీ విత్​ కరణ్​' జులై 7నుంచి డిస్నీ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కాబోతంది. హిందీలో అత్యంత పాపులారిటీ పొందిన షో ఇది. అయితే ఈ షో ప్రమోషన్స్​లో భాగంగా.. కరణ్​ జోహార్​ పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆలియా భట్​ గురించి ఆసక్తికర విషయాలను వెల్లండిచారు. ఆలియా భట్​తో తనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

ఆలియా భట్​- కరణ్​ జోహార్​

ఆలియా భట్​కు సంబంధించిన ప్రతి విషయాన్ని సెలబ్రేట్​ చేసుకునే వ్యక్తుల్లో కరణ్​ ముందు వరుసలో ఉంటారు. రణ్​బీర్​ కపూర్​- ఆలియా పెళ్లిలో కరణ్​ జోహార్​ హడావుడి మామూలుగా లేదు. ఈ క్రమంలో తాజాగా ఆలియా తన ప్రెగ్నెన్సీ గురించి వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసినప్పుడు కరణ్​ జోహార్​ చాలా భావోద్వేగానికి గురయ్యారట. 17 ఏళ్ల అమ్మాయిగా తన నా ఆఫీసులోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆలియాను చూస్తున్నానని చెప్పారు. అప్పటి నుంచి ఆలియాను నా కూతురుగా చూసుకుంటున్నానని వివరించారు. ఆమె తన మొదటి బిడ్డ అని కరణ్ జోహార్​ భావోద్వేగానికి గురయ్యారు.

" నేను నా ఆఫీసులో కూర్చొని ఉన్నా. ఆలియా వచ్చింది. తల్లి కాబోతున్న శుభవార్తని నాకు చెప్పింది. నాకు కళ్లలో నీళ్లు ఆగలేదు. ఆలియాను ఒక అమ్మాయిగా.. నటిగా.. ఇప్పుడు ఓ తల్లిగా మారడం చూస్తున్నా.. అందుకే కన్నీళ్లను ఆపుకోలేకపోయా. అదే విషయాన్ని ఆలియాకు కూడా చెప్పా."

- కరణ్​ జోహార్​, నిర్మాత

ఆలియా బిడ్డను తన చేతుల్లోకి తీసుకోవడానికి తాను వేచి ఉండలేనని చెప్పారు కరణ్​. అలియా 'స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాకి దర్శకుడు కరణ్ జోహారే. అప్పటి నుంచి వారిమధ్య మంచి బంధం ఉంది. 'కాఫీ విత్ కరణ్' షో సీజన్ 7 తొలి ఎపిసోడ్లో​ అతిథిలుగా ఆలియా, రణ్​వీర్​ సింగ్​ సందడి చేయనున్నారు.

ఇదీ చదవండి:'పజువూరు రాణి నందిని'.. యువరాణి ఆహార్యంలో మెరిసిన ఐశ్వర్యరాయ్​

ABOUT THE AUTHOR

...view details