తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గ్యాంగ్​స్టర్​ లారెన్స్ ముఠా​ హిట్​లిస్ట్​లో కరణ్​జోహార్​! - కరణ్​ జోహార్​ కిడ్నాప్​ కేసు

Karan Johar Kidnap: సల్మాన్​ ఖాన్​కు బెదిరింపుల కేసులో మరో షాకింగ్​ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన సిద్ధేశ్​ కాంబ్లే మరిన్ని విస్తుపోయే​ విషయాలను పోలీసు దర్యాప్తులో బయటపెట్టాడని తెలిసింది. తమ హిట్​లిస్ట్​లో ప్రముఖ నిర్మాత కరణ్​ జోహార్​ కూడా ఉన్నట్లు చెప్పాడట.

Karan Johar on the hit list of gangster Lawrence
గ్యాంగ్​స్టర్​ లారెన్స్ ముఠా​ హిట్​లిస్ట్​లో కరణ్​జోహార్

By

Published : Jun 20, 2022, 9:22 AM IST

Karan Johar Kidnap: పంజాబీ సింగర్​ సిద్ధూ మూసేవాలా హత్య, హీరో సల్మాన్​ ఖాన్​కు బెదిరింపులు, చంపేందుకు కుట్ర.. బాలీవుడ్​లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన సిద్ధేశ్ కాంబ్లే అలియాస్ మహాకాల్​.. మరో సంచలన విషయాన్ని బయటపెట్టినట్లు తెలిసింది. తమ హిట్​లిస్ట్​లో ప్రముఖ నిర్మాత కరణ్​ జోహార్​ కూడా ఉన్నట్లు చెప్పాడని ఓ పోలీస్​ అధికారి తెలిపారు. కరణ్​ను అపహరించి, బెదిరించి రూ.5కోట్లు డిమాండ్ చేయాలని మహాకాల్​ ముఠా ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఇదంతా అతడు కావాలనే చెబుతున్నట్లు ఉందని సదరు అధికారి పేర్కొన్నారు.

కాగా, ఇటీవలే గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ మూఠా.. సిద్ధూ మూసేవాలాను కాల్చి చంపిందన్న సమాచారంతో ఆ గ్యాంగ్​కు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో సల్మాన్‌కు పోలీసులు భద్రత కూడా పెంచారు. ఇంతకుముందు కూడా 2018లో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు చంపేస్తామన్నా బెదిరింపులు వచ్చాయి. వీటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి: సల్మాన్​కు బెదిరింపులే కాదు.. హత్యకు కుట్ర.. షాకింగ్​ విషయాలు వెలుగులోకి..

ABOUT THE AUTHOR

...view details