తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆత్మాహత్యాయత్నం చేసిన కమెడియన్‌.. ఫేస్‌బుక్‌ లైవ్‌లోనే విషం తాగి.. - తీర్థానంద రావు ఆత్మాహత్యాయత్నం

Kapil Sharma Show Comedian : బుల్లితెర ప్రముఖ కపిల్‌ శర్మ షో ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న కమెడియన్‌ తీర్థానంద రావు ఆత్మాహత్యాయత్నం చేశారు. ఫేస్​ బుక్​ లైవ్​లో మాట్లాడుతూ విషం తాగారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

The Kapil Sharma show artist Tirthanand Rao attempts suicide again during Facebook live
The Kapil Sharma show artist Tirthanand Rao attempts suicide again during Facebook live

By

Published : Jun 14, 2023, 3:12 PM IST

Updated : Jun 14, 2023, 3:25 PM IST

Kapil Sharma Show Comedian Suicide Attempt : బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే కామెడీ షో 'కపిల్‌ శర్మ షో'. సినీ పరిశ్రమకు చెందిన ఎందరో సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ షో ద్వారానే కపిల్‌ శర్మ, ఆయన కోస్టార్‌ తీర్థానంద రావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

ఫేస్​బుక్​ లైవ్​లోనే..
తన ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ ఆయన విషం తాగి తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న ఆయన స్నేహితులు అపస్మారకస్థితిలో ఉన్న తీర్థానందను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది.

కమెడియన్‌ తీర్థానంద రావు

సహజీవనం చేస్తున్న మహిళ వల్లే!
తను సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం వేధిస్తోందని వీడియోలో తీర్థానంద రావు ఆరోపించారు. ఇప్పటికే ఆమె వల్ల చాలా అప్పు చేసినట్లు తెలిపారు. తనపై పోలీసు కేసు కూడా పెట్టిందని చెప్పారు. మానసికంగా వేధిస్తోందన్నారు. అయితే ఆయన లైవ్​ వీడియో డిలీట్​ చేసినట్లు తెలుస్తోంది.

ఇది రెండో సారి!
గతంలోనూ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో ఉంటే తనను చూడడానికి ఎవరూ రాలేదని.. డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చాక కూడా తాను ఒంటరిగానే ఉంటున్నట్లు తెలిపారు. 2016 వరకు 'కపిల్‌ శర్మ షో' లో ఉన్న ఆయన.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం వల్ల షో నుంచి వెళ్లిపోయారు.

సూసైడ్​కు సిద్ధపడ్డ రైటర్​ కోన వెంకట్​.. ఆ అమ్మాయిని చూసి..
టాలీవుడ్​లో ఉన్న ప్రముఖ రైటర్స్​లో కోన వెంకట్​ ఒకరు. గీతాంజలి, నిన్ను కోరి, జై లవకుశ వంటి అనేక సూపర్​హిట్​ చిత్రాలకు ఆయన రైటర్​గా పనిచేశారు. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్​ షో సుమ అడ్డాకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రతి శనివారం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఈ షోకు పులి మేక చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్​ లావణ్య త్రిపాఠితో పాటు కోన వెంకట్‌ విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా కోన వెంకట్​ తన జీవితంలో మర్చిపోలేని సంఘటనను పంచుకున్నారు. తాను ఒకానొక సమయంలో ఆత్మహత్యకు సిద్ధపడినట్లు తెలిపారు. అప్పుడు చేతి నిండా నిద్రమాత్రలను తీసుకుని సూసైడ్ చేసుకునేందుకు సిద్ధమయ్యానని, కానీ ఓ అమ్మాయిని చూసి ఆ మాత్రలన్నీ కింద పడేశానని చెప్పారు. అసలు అప్పుడు ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేసి వీడియో చూసేయండి.

Last Updated : Jun 14, 2023, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details