తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Kantara: రిషభ్​ శెట్టి-జూనియర్ ఎన్టీఆర్‏కు ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా? - కాంతార సినిమా థియేటర్స్​

ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న కాంతార సినిమా హీరో రిషభ్​ శెట్టి.. ఎన్టీఆర్​పై తనకున్న అభిమానాన్ని తెలిపారు. అలాగే తామిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఏమన్నారంటే..

Kantara movie hero Rishab shetty about Juniour NTR
రిషభ్​ శెట్టి-జూనియర్ ఎన్టీఆర్‏కు ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా

By

Published : Oct 15, 2022, 12:01 PM IST

ప్రస్తుతం సినీఇండస్ట్రీలో ఎక్కడ చూసిన కాంతార పేరు వినిపిస్తోంది. కన్నడ స్టార్ రిషభ్​ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. మంచి వసూళ్లను అందుకుంటోంది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. కర్ణాటకలో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగులో నేడు(అక్టోబర్ 15న) విడుదలైంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రిషభ్​ శెట్టి.. తన అభిమాన హీరో ఎన్టీఆర్ అని.. అలాగే తారక్‏కు తనకు మధ్య ఓ కామన్ కనెక్షన్ ఉందని తెలిపారు.

రిషబ్ శెట్టి మాట్లాడుతూ. "తెలుగు చిత్రపరిశ్రమలో అనేక మంది హీరోస్ ఉన్నారు. కానీ నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అతనితో నాకు మరొక అనుబంధం కూడా ఉంది. అదేంటంటే.. తారక్ అమ్మగారు కూడా మా గ్రామాం కుందాపూర్​కు చెందినవారే" అని చెప్పారు. అలాగే 'మీ దర్శకత్వంలో తారక్ సినిమా చేస్తారా' అని ప్రశ్నించగా.. ఇప్పటివరకు అలాంటి ఆలోచనలు లేవని, మంచి కథ ఉన్నప్పుడు ఆలోచించుకుంటానని అన్నారు.

ఇదీ చూడండి:ఆదిపురుష్​పై కామెంట్స్​.. క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు

ABOUT THE AUTHOR

...view details