తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తిరుగులేని 'కాంతారా'.. కలెక్షన్లలో నయా రికార్డు.. కేజీఎఫ్​ తర్వాత.. - కాంతార సినిమా వార్తలు

కన్నడ మూవీ 'కాంతారా'.. విడుదలకు ముందు అసలు ప్రమోషన్స్​ లేవు. కానీ సినిమా రిలీజైన రోజు నుంచి మూడు వారాలుగా బాక్సాఫీస్​ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. విడుదలై ఇరవై రోజులైన వసూళ్లు ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే?

kantara movie collections
kantara movie collections

By

Published : Oct 20, 2022, 1:35 PM IST

Kantara Box Office Collections: ఇప్పుడు చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేదు. భాషా భేదాలు లేవు. కంటెంట్ నచ్చిందంటే చాలు.. ఏ సినిమాను అయినా ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే తాజా ఉదాహరణ 'కాంతారా'. ఈ కన్నడ మూవీ సెప్టెంబర్‌ 30న రిలీజైనప్పటి నుంచీ గత మూడు వారాలుగా బాక్సాఫీస్‌ రికార్డులను బ్రేక్‌ చేస్తూనే ఉంది.

తాజాగా 20వ రోజు కూడా మరో రికార్డును సొంతం చేసుకుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో మూడోస్థానానికి చేరింది. ఈ క్రమంలో గత రెండు రోజుల వ్యవధిలోనే రెండు పెద్ద కన్నడ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది రిలీజైన కిచ్చా సుదీప్‌ మూవీ విక్రాంత్‌ రోణ (రూ.158 కోట్లు), పునీత్‌ రాజ్‌కుమార్‌ చివరి సినిమా జేమ్స్‌ (రూ.151 కోట్లు) రికార్డులను కాంతారా అధిగమించింది.

ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్‌ 19 నాటికి 'కాంతారా' మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్లు వసూలు చేసింది. అందులో రూ.150 కోట్లకుపైగా కేవలం ఇండియన్‌ మార్కెట్‌ నుంచే రావడం విశేషం. 20వ రోజు కూడా ఈ మూవీ రూ.10 కలెక్షన్లతో రికార్డు సృష్టించింది. 'కేజీఎఫ్‌ 2' (రూ.1207 కోట్లు), 'కేజీఎఫ్‌' (రూ.250 కోట్లు) తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ మూవీగా 'కాంతారా' నిలిచింది. ఈ సినిమా రిలీజైన సమయంలో అసలు ఇన్ని బాక్సాఫీస్‌ రికార్డులను బ్రేక్‌ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అసలు ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్లు కూడా లేవు. సినిమా బాగుంది అన్న మౌత్‌ పబ్లిసిటీయే ఈ సినిమాకు కాసుల వర్షం కురిపించింది.

ఇక ఈ సినిమా కన్నడలో హిట్‌ కావడంతో తెలుగు, తమిళం, హిందీల్లోనూ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​ విడుదల చేశారు. కాగా, తెలుగులో ఈ సినిమా ఇప్పటివరకు రూ.22.3 కోట్లు వసూళ్లు రాబట్టిందని హోంబలే ఫిల్మ్​ అధికారికంగా ప్రకటించింది.

తెలుగు కాంతార వసూళ్లు

వరహరూపం.. దైవ వరిష్ఠం..
కొన్ని పాటలు ఎంత విన్నా, ఇంకా వినాలనిపిస్తూ ఉంటాయి. ఆ పాటకు నటనార్చన తోడైతే ఒళ్లు గగుర్పాటుకు గురవటమే కాదు, ఆనందంతో కంటి నుంచి అశ్రుధారలు దారులు కడతాయి. ప్రస్తుతం థియేటర్‌లో అలాంటి అనుభూతిని పంచుతున్న పాట 'వరహరూపం.. దైవ వరిష్ఠం..' 'కాంతార' చిత్రంలోని ఈ పాటకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. క్లైమాక్స్‌లో రిషబ్‌శెట్టి రూపకం చూసి ఒళ్లు జలదరించని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తికాదు.

అలాంటి నృత్యరూపకాన్ని ఎలా తీశారో చెబుతూ లిరికల్‌ వీడియోను చిత్ర నిర్మాణ హోం బాలే ఫిల్మ్స్‌ పంచుకుంది. సంప్రదాయ వాయిద్యాలతో సంగీత దర్శకుడు అజనీశ్‌ లోకనాథ్‌ స్వరాలు సమకూర్చడంతో మొదలైన పాట ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దారు. ఆ పాటను దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి తెరకెక్కిస్తున్న సన్నివేశాలు, ఆ పాత్రల్లో వివిధ నటులు కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ పాటకు షాషిరాజ్‌ కవూర్‌ సాహిత్యం అందించగా, సాయి విఘ్నేష్‌ ఆలపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details