కన్నడ చిత్రసీమతో పాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో విభిన్నపాత్రలు పోషించిన ప్రముఖ నటుడు కిశోర్ కుమార్. తాజాగా ఆయన ట్విటర్ అకౌంట్‌పై వేటు పడింది. 'ఆయన ఖాతా సస్పెండ్ అయింది. ట్విటర్ నిబంధలను ఉల్లంఘించిన వారి ఖాతాలను సంస్థ నిలిపివేస్తుంది' అని ఆయన ట్విటర్ పేజ్‌లోకి వెళ్లినవారికి ఈ సందేశం కనిపిస్తోంది. అయితే దీనిని ఎప్పుడు నిలిపివేశారో, ఏ ట్వీట్ వల్ల ఈ సస్పెన్షన్ ఎదుర్కొంటున్నారో తెలియాల్సి ఉంది. అయితే ఆయన ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ట్విటర్ సీఈఓ ఎలాన్‌మస్క్‌కు నేరుగా అభ్యర్థన పెడుతున్నారు.
'కాంతార' యాక్టర్ ట్విటర్ ఖాతాపై వేటు.. అసలేం జరిగింది? - కిశోర్ కుమార్ ట్విట్టర్ అకౌంట్‌పై వేటు
కాంతార ఫేమ్ స్టార్ యాక్టర్ కిశోర్ కుమార్ ట్విటర్ అకౌంట్‌పై వేటు పడింది. అయితే అందుకు గల కారణాలు తెలియలేదు.
ఇటీవల దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించిన కన్నడ చిత్రం కాంతారలోనూ కిశోర్ కీలక పాత్ర పోషించారు. అటవీ శాఖ అధికారిగా అలరించారు. అలాగే ఫ్యామిలీ మ్యాన్, షీ వెబ్‌సిరీస్‌లలోనూ నటించారు. ఇకపోతే ఈయన ఏ విషయంపైన అయినా తన అభిప్రాయాలను సూటిగా వెల్లడిస్తారు. రైతులకు సంబంధించిన అంశాలపై తన గళాన్ని వినిపిస్తుంటారు. అలాగే మీడియా సంస్థ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ దక్కించుకోవడాన్ని ఇన్‌స్టాగ్రాం వేదికగా వ్యతిరేకించారు. మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ.. తనదైన శైలిలో స్పందించారు.
ఇదీ చూడండి:ఆ సినిమా కోసం రాజశేఖర్‌ను రికమెండ్ చేసిన చిరంజీవి