Kanappa First Poster :టాలీవుడ్ హీరో, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్.. దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. కాగా, గురువారం (నవంబర్ 23) హీరో విష్ణు పుట్టినరోజు సందర్భంగా.. మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇక కన్నప్ప సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌లో ఓ కీలక షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. హీరో విష్ణు కలల ప్రాజెక్ట్ కావడం వల్ల.. ఎక్కడ కూడా రాజీ పడకుండా నిర్మాత మోహన్ బాబు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు రచయితలుగా వ్యవహరిస్తుండగా.. మణిశర్మ, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.
ప్రభాస్ - నయనతార!అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరూ శివపార్వతులుగా స్ర్కీన్‌పై కనిపించనున్నట్లు టాక్. వీరితోపాటు సినిమాలో.. కన్నడ హీరో శివరాజ్‌కుమార్, మలయాళీ మెగాస్టార్ మోహల్, శరత్ కుమార్ తదితరులు నటించనున్నారు. అయితే బాలీవుడ్ బ్యూటీ నపూర్ సనన్ ఈ సినిమాలో నటించాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.