ప్రముఖ నటి కంగనా రనౌత్ ఖాతాను ట్విటర్ పునరుద్ధరించింది. ఈ మేరకు ఆమె మంగళవారం సాయంత్రం ట్వీట్ చేశారు. 'అందరికీ నమస్కారం. మళ్లీ ఇక్కడ (ట్విట్టర్‌లోకి)కు రావడం సంతోషంగా ఉంది' అని ఫస్ట్ పోస్ట్ పెట్టిన నటి రెండో ట్వీట్‌లో తన కొత్త సినిమా వివరాలు ఉంచారు. 'ఎమర్జెన్సీ' సినిమా చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. 2023 అక్టోబరు 20న థియేటర్లలో విడుదలవుతుంది' అని తెలిపారు. షూటింగ్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. 'క్వీన్ ఈజ్ బ్యాక్' అంటూ కంగనా అభిమానులు, ట్విటర్ యూజర్లు కామెంట్ల రూపంలో ఆమెకు స్వాగతం పలుకుతున్నారు.
ట్విట్టర్ గూటికి తిరిగొచ్చిన కంగన.. 'క్వీన్ ఈజ్ బ్యాక్' అంటూ ఫ్యాన్స్ ఖుషీ! - కంగనా రనౌత్ ట్వీట్
ప్రముఖ నటి కంగనా రనౌత్ ఖాతాను ట్విటర్ పునరుద్ధరించింది. ఈ మేరకు ఆమె మంగళవారం సాయంత్రం ట్వీట్ చేశారు.
kangana ranaut twitter account restored
బెంగాల్ ఎన్నికల పరిణామాలపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసి.. సంస్థ నిబంధనలను కంగనా ఉల్లంఘించారంటూ ట్విటర్ 2021 మేలో ఆమె ఖాతాను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అకౌంట్‌ను పునరుద్ధరించారు. 'బ్లూటిక్'ను ఇంకా జారీ చేయలేదు. సినిమా విషయానికొస్తే.. స్వతంత్ర భారతంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న చిత్రమే 'ఎమర్జెన్సీ'. ఈ సినిమాకి కంగనానే దర్శకత్వం వహించారు. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.