Kangana Ranaut Tejas Collections :బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కెరీర్.. ప్రస్తుతం వరుస పరాజయాలతో కొనసాగుతోంది. మణికర్ణిక తర్వాత ఆమె నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. గత నెలలో రిలీజైన 'చంద్రముఖి 2' ఫ్లాప్ అవ్వగా.. ఇప్పుడు తేజస్ కూడా బోల్తా కొట్టింది. సర్వేష్ మేరావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే రూ.6 కోట్లు కూడా వసూళ్లు రాలేదు. దీంతో ట్రేడ్ వర్గాలే నోరెళ్ల బెడుతున్నాయి.
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తేజస్ చిత్రం దారుణమైన ఓపెనింగ్స్‌ను తెచ్చుకుంది. తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.1.25కోట్ల కలెక్షన్స్ అందుకోగా.. సోమవారం వరకు రూ.4.25 కోట్ల వరకు అందుకుంది. ఇక మంగవారం పెద్దగా ఏమీ రాలేదంట. శని, ఆదివారాల్లో చాలా థియేటర్‌లలో 10-12 మంది మాత్రమే ఆడియెన్స్ కనిపించారని తెలిసింది. సోమవారం అయితే పలు థియేటర్లలో ఏకంగా షోలనే రద్దు చేశారట. రీసెంట్గా బాలీవుడ్లో రిలీజైన చిత్రాల్లో అతి తక్కువ వసూళ్లను అందుకున్న సినిమాల జాబితాలో ఇప్పుడు తేజస్ చేరిపోయింది.