తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రాజమౌళిపై కంగన కామెంట్స్... వాటివల్లే సక్సెస్ అయ్యారంటూ... - రాజమౌళి కంగనా రనౌత్

Kangana Ranaut on Rajamouli: దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని వీక్షించారు ప్రముఖ నటి కంగనా రనౌత్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి తన వృత్తిపట్ల చూపించే ప్రేమాభిమానాలే ఆయన్ను ఈ స్థాయికి చేర్చాయని అభిప్రాయపడ్డారు.

KANGANA RANAUT
KANGANA RANAUT

By

Published : Mar 31, 2022, 10:43 PM IST

Kangana Ranaut on Rajamouli: దర్శకుడు రాజమౌళిని తాను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటానని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అన్నారు. తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాన్ని వీక్షించిన కంగన రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళిని పొగుడుతూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు. భారత చలనచిత్ర రంగంలో రాజమౌళి గొప్ప దర్శకుడని ఆమె అన్నారు. పనిపట్ల ఆయన చూపించే అంకితభావమే.. ఆయన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని కంగన తెలిపారు.

Kangana Ranaut RRR Movie: "భారత చలన చిత్ర రంగంలో గొప్ప దర్శకుడిగా రాజమౌళి నిరూపించుకొన్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఇప్పటివరకూ పరాజయం కాలేదు. నటీనటులకిచ్చే గౌరవం, దేశంపట్ల, తన వృత్తిపట్ల ఆయన చూపించే ప్రేమాభిమానాలే ఈ స్థాయికి చేర్చాయి. రాజమౌళి సర్‌.. మిమ్మల్ని రోల్‌ మోడల్‌గా ఫాలో అవుతున్నందుకు సంతోషిస్తున్నా. ఎప్పటికీ నేను మీకు అభిమానినే" అని కంగన రాసుకొచ్చారు. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయానికి వస్తే.. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు సంపాదించగా.. కేవలం బాలీవుడ్‌లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details