తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Kangana Chandramukhi First Look : ఆసక్తికరంగా కంగనా లుక్​.. రాజ నర్తకిగా చీరలో మెరుస్తూ.. - చంద్రముఖి 1

Kangana Chandramukhi First Look : రాఘవ లార్సెన్స్​, కంగనా రనౌత్​ లీడ్​ రోల్స్​లో తెరకెక్కుతున్న 'చంద్రముఖి-2' మూవీ నుంచి ఓ నయా పోస్టర్​ను రిలీజ్​ చేశారు మూవీ మేకర్స్​. ఇప్పటికే సినిమాలోని రాఘవ లుక్​ను ప్రేక్షకులకు చూపించిన మేకర్స్​.. ఇప్పుడు రాజ నర్తకి చంద్రముఖి పోస్టర్​ను రిలీజ్​ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. శనివారం ఈ సినిమా నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆ ఫొటో మీ కోసం..

Kangana Chandramukhi First Look
Kangana Chandramukhi First Look

By

Published : Aug 5, 2023, 2:01 PM IST

Updated : Aug 5, 2023, 2:16 PM IST

Kangana Chandramukhi First Look : కోలీవుడ్​ నటుడు రాఘవ లారెన్స్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి-2'. తమిళ స్టార్​ దర్శకుడు పి. వాసు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చంద్రముఖిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని 'చంద్రముఖి' ఫస్ట్​ లుక్​ అంటూ మూవీ మేకర్స్​ ఓ అద్భుతమైన పోస్టర్​ను విడుదల చేశారు. రాజ నర్తకిగా మెరిసిపోతున్న కంగనా.. పట్టు చీరతో పాటు నడుముకు వడ్డాణం మెడలో హారం, నుడుటన పాపిటబిళ్ల.. ఇలా పైన నుంచి కిందవరకు ఆభరణాలను ధరించి కంగనా కనిపించారు. తదేకంగా చూస్తూ కనిపించిన కంగనా.. ఈ పోస్టర్​తో అందరి దృష్టిని ఆకర్షించారు.

Chandramukhi 2 Raghava Look : ఇటీవలే హీరో రాఘవ లారెన్స్ ఫస్ట్​ లుక్​ను కూడా మేకర్స్​ విడుదల చేశారు. అందులో రాజు వేషధారణలో హుందాగా నడిచి వస్తున్నట్లు రాఘవ కనిపించారు. ఇక పోస్టర్​లో లారెన్స్ కళ్లల్లో రాజసం ఉట్టిపడుతూ కనిపించింది. ఈ పోస్టర్​కు కూడా నెట్టింట మంచి రెస్పాన్స్​ వచ్చింది.

Chandramukhi 2 Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. 'చంద్రముఖి-1'కు సీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారెన్స్​, కంగనాతో పాటు వడివేలు, విఘ్నేష్, లక్ష్మీ మేనన్, సృష్టి డాంగే, మహిమా నంబియార్, రావు రమేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీర‌వాణి సంగీతాన్ని అందిస్తుండగా..ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ బాధ్యతలు చేపట్టారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్​గా ఆంథోని ఎడిట‌ర్‌గా పనిచేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా వచ్చే సెప్టెంబర్​లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్​లో రిలీజ్​ చేసేందుకు మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారు.

తొలి పార్ట్​ ఇలా..
Chandramukhi Part 1 Cast :2005లో విడుదలైన 'చంద్రముఖి' పార్ట్​ 1లో సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభు, జ్యోతిక నటించారు. ఇందులో 'చంద్రముఖి'లా జ్యోతిక నటించి ప్రేక్షకులు మనన్నలు పొందారు. ఓ వైపు గంగ అనే క్యారెక్టర్​లో అమాయకంగా కనిపస్తూనే చంద్రముఖి క్యారెక్టర్​తో అందరిని భయపెట్టారు. ఇక వెంకటపతి రాజుగా రజనీ కూడా తనదైన స్టైల్​లో నటించి అలరించారు. సుమారు రూ. 9 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్​ను షేక్​ చేసింది. అంతే కాకుండా మలయాళంలో 'మణిచిత్రతాజు'గా, హిందీలో 'భూల్ భులయ్య'గా తెరకెక్కి అక్కడి ప్రేక్షకులను అలరించింది.

Last Updated : Aug 5, 2023, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details