తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ హీరోతో ప్రియాంక క్లోజ్​.. చూసి​ తట్టుకోలేక కరణ్​ వేధింపులు'.. కంగన షాకింగ్​ కామెంట్స్​! - ప్రియాంక చోప్రా లేటెస్ట్ అప్డేట్స్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి ట్విట్టర్​ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కో స్టార్​ ప్రియాంకకు మద్దతు తెలుపుతూ ఆమె చేసిన ట్వీట్స్​ ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ కంగనా ఏమన్నారంటే?

kangana ranaut supports priyanka chopra
kangana ranaut supports priyanka chopra

By

Published : Mar 29, 2023, 12:48 PM IST

Updated : Mar 29, 2023, 2:04 PM IST

బాలీవుడ్​లోని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్​ జోహార్​పై స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్ మరోసారి​ సంచలన ఆరోపణలు చేశారు. తన కో స్టార్​ ప్రియాంక చోప్రాను ఆయన బ్యాన్‌ చేశాడంటూ ఆరోపించారు. నటుడు షారుక్​ ఖాన్​తో ప్రియాంక క్లోజ్‌ ఉండడాన్ని కరణ్​ తట్టుకోలేకపోయారని.. అందుకే ఆమెను మానసికంగా వేధించారంటూ ట్విట్టర్​ వేదికగా తన స్నేహితురాలికి మద్దతు తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్​ సోషల్​ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

"బాలీవుడ్‌లో కొంతమంది గ్యాంగ్‌గా మారి ప్రియాంకను అవమానించారు. స్వయం కృషితో ఎదిగిన ఓ మహిళను భారత్‌ వదిలి వెళ్లిపోయేలా చేశారు. కరణ్‌ జోహార్‌ ఆమెను బ్యాన్‌ చేశారనే విషయం అందరికి తెలుసు. షారుఖ్​ఖాన్‌తో ప్రియాంక సన్నిహితంగా ఉండటం కరణ్‌కు నచ్చలేదు. అందుకే ఆమెను దూరం పెట్టాడు. ఈ విషయంపై అప్పట్లో మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. సినీ పరిశ్రమ వాతావరణాన్ని, సంస్కృతిని నాశనం చేసినందుకు ఆ వ్యక్తి (కరణ్‌ను ఉద్దేశిస్తూ) బాధ్యత వహించాలి. అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ లాంటి ప్రముఖులు సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు అస్సలు లేవు" అంటూ వరుస ట్వీట్​లు చేశారు.

అసలు ఏం జరిగింది?
బాలీవుడ్‌ పరిశ్రమపై ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తాజాగా ఓ అమెరికన్​ మీడియా​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్‌ చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో యాంకర్​ అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన ప్రశ్నలు ప్రస్తుతం చర్చలకు దారి తీస్తున్నాయి. ఆమె బాలీవుడ్​కు ఎందుకు దూరమయ్యారు అని యాంకర్​ అడిగిన ప్రశ్నకు.. హిందీ చిత్ర పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని తట్టుకోలేకే తాను హాలీవుడ్‌కు వచ్చేశానని తెలిపారు. అంతే కాకుండా బీ టౌన్​లో తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.

"బాలీవుడ్​ ఇండస్ట్రీలో నన్ను ఓ పక్కకు తోసేశారు. ఎవరూ నాకు అవకాశాలు ఇచ్చేవారు కాదు. పలువురితో పరస్పర విభేదాలు ఏర్పడేవి. అక్కడ రాజకీయాలు ఉంటాయి. వాటితో నేను విసిగిపోయా. అందుకే ఆ ఇండస్ట్రీ నుంచి బ్రేక్‌ తీసుకోవాలనిపించింది. అలా అమెరికా వచ్చేశా. 'దేశీ హిట్స్‌'కు చెందిన అంజులా ఆచార్య తన మ్యూజిక్‌ వీడియో చూసి.. హాలీవుడ్‌లో అవకాశాలు కల్పించారు" అని ప్రియాంక తెలిపారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో కంగన, వివేక్‌ అగ్నిహోత్రి లాంటి సినీ ప్రముఖులు ఆమెకు సోషల్​ మీడియా వేదికగా మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం ప్రియాంకపై విమర్శల గుప్పిస్తున్నారు.

బాలీవుడ్​లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో మెరిసిన ప్రియాంక 'క్వాంటికో' అనే టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 'ఏ కిడ్‌ లైక్‌ జాక్', 'బేవాచ్‌', 'వుయ్‌ కెన్‌ బీ హీరోస్‌', 'ది వైట్‌ టైగర్‌' తదితర చిత్రాల్లో నటించారు. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను ప్రేమించి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఓ పాప కూడా ఉంది.

Last Updated : Mar 29, 2023, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details