తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కశ్మీరీ సింగర్'​ పాత్రలో కంగనా.. ప్రొఫెసర్‌ విశ్వామిత్రగా మోహన్​బాబు

బాలీవుడ్​ భామ కంగనా రనౌత్​ ప్రధాన పాత్రలో దర్శకుడు మధుర్​.. ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో కంగనా ఓ కశ్మీరీ గాయకురాలి పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు, 'అగ్నినక్షత్రం' సినిమాలో ప్రొఫెసర్‌ విశ్వామిత్ర పాత్రలో మోహన్​బాబు సందడి చేయనున్నారు.

kangana-new-movie-and-mohanbabu-agni-nakashtaram-movie
kangana-new-movie-and-mohanbabu-agni-nakashtaram-movie

By

Published : Aug 1, 2022, 6:56 AM IST

Kangana New Movie: బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో.. జాతీయ అవార్డుల దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ ఓ కొత్త చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భండార్కర్‌ తెలిపారు. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఓ కశ్మీరీ గాయకురాలి జీవితం ఆధారంగా ఈ ఇది పట్టాలెక్కనుంది. నిర్మాత ఫిరోజ్‌ నడియాద్‌వాలా తెరకెక్కించనున్నట్టు సమాచారం. మరోవైపు కంగనా 'ఎమర్జెన్సీ' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అందులో తను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తున్నారు.

కంగనా రనౌత్​

Mohanbabu Agni Nakashtaram Movie: తన ఆలోచనలతో, ఆదర్శాలతో ఎవ్వరినైనా ఇట్టే ప్రభావితం చేయగల సైకియాట్రిస్ట్‌, ప్రొఫెసర్‌ విశ్వామిత్ర కథేమిటో తెలియాలంటే 'అగ్ని నక్షత్రం' చూడాల్సిందే. మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రమిది. తండ్రీ తనయలైన ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రమూ ఇదే. విశ్వంత్‌ కథానాయకుడు. ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం ఈ సినిమాలోని మోహన్‌బాబు లుక్‌ని విడుదల చేశారు. ప్రొఫెసర్‌ విశ్వామిత్ర పాత్రలో ఆయన సందడి చేయనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. 'మోహన్‌బాబు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన లుక్‌ ఆ విషయాన్నే స్పష్టం చేస్తోంది. సముద్రఖని, చైత్ర శుక్ల ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ నటుడు సిద్ధిక్‌ విలన్‌గా నటిస్తున్నార'ని చిత్రవర్గాలు తెలిపాయి. కూర్పు: మధురెడ్డి, సంగీతం: లిజో కె.జోష్‌, ఛాయాగ్రహణం: గోకుల్‌ భారతి.

మోహన్​బాబు

Ponniyan Selvan New Song: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌ 1'. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, త్రిష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలోని 'పొంగే నది పాడినది.. చిందులేయరా' అంటూ సాగే పాటని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం విడుదల చేశారు. ఈ పాటని అనంతశ్రీరామ్‌ రచించారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరచడంతోపాటు, ఎ.ఆర్‌.రెహామాన్​, బంబ బకియాతో కలిసి ఆలపించారు. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ సినిమాని సెప్టెంబర్‌ 30న విడుదల చేయనున్నారు. ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తీబన్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడు.

ఇవీ చదవండి:రాకెట్రీకి రజిని ఫిదా.. మాధవన్‌, నంబి నారాయణన్‌కు సత్కారం

వీల్‌ ఛైర్‌లో వచ్చిన నిత్యా మేనన్‌.. ఫ్యాన్స్ ఆందోళన.. అసలేమైంది?

ABOUT THE AUTHOR

...view details