Kamalhassan Vikram Digital rights record: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన 'విక్రమ్' చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. జూన్ 3న (థియేటర్లలో) ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు సుమారు రూ.125 కోట్లకు అమ్ముడయ్యాయి. 'స్టార్' గ్రూప్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకోగా డిజిటల్ రైట్స్‌ను 'డిస్నీ+ హాట్‌స్టార్' చేజిక్కించుకుంది.
కమల్ హాసన్ 'విక్రమ్' @125కోట్లు.. రిలీజ్‌కు ముందే రికార్డు! - కమల్‌హాసన్ విక్రమ్ దర్శకుడు
Kamalhassan Vikram Digital rights record: కమల్‌హాసన్ నటిస్తున్న 'విక్రమ్' సినిమా రిలీజ్ కాకముందే ఓ రికార్డు సాధించింది. ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ హక్కులు సుమారు రూ.125 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది.
![కమల్ హాసన్ 'విక్రమ్' @125కోట్లు.. రిలీజ్‌కు ముందే రికార్డు! Kamalhassan Vikram Digital rights record](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15196377-thumbnail-3x2-virkam.jpg)
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కానుంది. 'ఖైదీ' ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. కమల్ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నారని సమాచారం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ సినిమాను కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. కమల్‌కు ఇది 232వ సినిమా. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లింప్స్‌కు విశేష స్పందన వచ్చింది. మే 15న ట్రైలర్ విడుదలకానుంది. మే 18న 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్'లో ట్రైలర్ ప్రదర్శితమవుతుందని చిత్ర బృందం తెలిపింది.
ఇదీ చూడండి: Kamal hassan: 'విక్రమ్' వచ్చేస్తున్నాడు.. మేకింగ్ వీడియో అదిరింది!