గతేడాది సిల్వర్ స్క్రీన్‌పై ఓ వైపు కమల్ హాసన్‌ను, మరోవైపు విజయ్ సేతుపతిని చూసిన ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారిద్దరి యాక్షన్ సీన్స్, యాక్టింగ్ చూడటానికి ఆడియెన్స్‌కు రెండు కళ్లు చాలలేదు. ఇక అదే సినిమా క్లైమాక్స్‌లో సూర్య రోలెక్స్ రోల్ అయితే సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇండియా వైడ్ ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. ఇప్పుడు అలాంటి తరహా పవర్ఫుల్ పాత్రలోనే యూనివర్సల్ స్టార్ కమల్ కనపడితే ఓ సారి ఊహించుకోండి. ఆ ఇమేజనరీ సీన్ మాములుగా లేదు కదూ. ఇప్పుడదే ఊహలో దళపతి విజయ్-కమల్ హాసన్ కలిసి కనపడితే ఎలా ఉంటుంది? ఇక గూస్ బంప్సే కదా. ఇప్పుడదే ప్రయత్నం చేయడానికి 'విక్రమ్' దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
లోకేశ్ మాస్టర్ ప్లాన్.. 'దళపతి 67'లో కమల్ హాసన్.. రోలెక్స్ తరహా పాత్రలో! - లోకేశ్ కనగరాజ్ దళపతి 67
విజయ్ 'దళపతి 67'లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. సూర్య రోలెక్స్ తరహా పవర్ఫుల్ పాత్ర అని తెలుస్తోంది. ఆ సంగతులు..
![లోకేశ్ మాస్టర్ ప్లాన్.. 'దళపతి 67'లో కమల్ హాసన్.. రోలెక్స్ తరహా పాత్రలో! Kamalhassan in Lokesh kanagaraj Thalapathy 67 movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17566500-thumbnail-3x2-vikram.jpg)
అసలే ఈ ఏడాది 'విక్రమ్'తో భారీ హిట్‌ను అందుకున్న లోకేశ్.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను దళపతి విజయ్‌తో కలిసి 'దళపతి 67' చేస్తున్నారు. 'మాస్టర్' తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు లోకేశ్ సినిమా అంటేనే.. అది ఎల్‌సీయూ(లోకేశ్ సినిమాటిక్ యూనివర్శ్) నేపథ్యమా? కాదా అని ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే దళపతి 67 ఎల్‌సీయూలో భాగమా కాదా అనేది క్లారిటీ లేదు. కానీ త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐదుగురు ప్రతినాయకులు ఉంటారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరు సంజయ్ దత్ అని కూడా అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నప్పటికీ.. ఇప్పుడూ కమల్ హాసన్ పేరు కూడా వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ ప్రచారం వచ్చినప్పటి నుంచి విజయ్ వర్సెస్ సంజయ్‌దత్, విజయ్ విత్ కమల్ అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్ మేనన్ భాగం కాగా, త్రిష కూడా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.