తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పొన్నియన్‌ సెల్వన్‌' వివాదం.. కమల్‌ సెన్సేషనల్​ కామెంట్స్​.. ఏమన్నారంటే? - పొన్నియన్ సెల్వన్ గొడవలు

'పొన్నియన్ సెల్వన్' సినిమా వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఇప్పటికే రజనీకాంత్ ఈ సినిమాపై స్పందించగా.. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చోళరాజులు హిందువులే కాదని ఆయన​ అన్నారు. ఇంకేమన్నారంటే?

kamal hasan comments on ponniyan selvan movie
kamal hasan comments on ponniyan selvan movie

By

Published : Oct 6, 2022, 2:40 PM IST

Kamal Hasan On PS1 Movie Issue: మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన 'పొన్నియన్‌ సెల్వన్‌' భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణంతో పాన్‌ ఇండియా చిత్రం రూపొందిన ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. అయితే తమిళనాట తప్ప ఈ సినిమా మరే భాషల్లో పెద్దగా ఆదరణ అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమాను బాహుబలితో పోల్చడంతో.. విడుదల అనంతరం ఇదే అంశంపై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. అసలు బాహుబలికి, పొన్నియన్‌ సెల్వన్‌కు పోలికే లేదంటూ విమర్శిస్తున్నారు.

దీంతో తమిళనాట దీనిపై పెద్ద వివాదమే రాజుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై లోకనాయకుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచాయి. "సినిమా బాగుంటే ఏ భాష వారైనా ఆదరిస్తారు. మనం 'శంకరాభరణం' ఆదరిస్తే వాళ్ళు మన 'మరో చరిత్ర'ను ఆదరించారు. 'పొన్నియిన్ సెల్వన్' ఒక తమిళ చారిత్రక కథ, దానిని ఇతర భాష వారు ఆదరించాలనే నియమం లేదు. దీనికి పోయి ఇతర భాషల ప్రజలను దూషించడం తగదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

అనంతరం అసలు చోళరాజులు హిందువులు కాదంటూ కమల హాసన్ కామెంట్స్‌ చేశారు. రాజరాజ చోళుడి కాలంలో హిందుత్వమే లేదని, అప్పట్లో హిందూ మతం లేదన్నారు. శైవం, వైష్ణవం మాత్రమే ఉన్నాయని చెప్పారు. మనదేశంలోకి బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తర్వాత మనల్ని ఎలా పిలవాలో తెలియక హిందువులని సంబోధించారని కమల్‌ పేర్కొన్నారు. ఇక కళలకు భాష, కులం, మతం లేదని.. వీటి ప్రాతిపదికన సినీ పరిశ్రమలో రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.

ఇవీ చదవండి:ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో నోరా ఫతేహి!.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డ్​!!

'మంత్రి కాగానే అన్నీ మర్చిపోతారా? జబర్దస్త్​ గురించి అప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలేనా?'

ABOUT THE AUTHOR

...view details