తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'భారతీయుడు 2'లో టీమ్ఇం​డియా స్టార్​​ క్రికెటర్​ తండ్రి - భారతీయుడు2లో భారత క్రికెటర్​ తండ్రి

శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటిస్తోన్న సినిమా భారతీయుడు2. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ క్రికెటర్‌ తండ్రి నటిస్తున్నారనే అప్డేట్​ విని ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే..

కమల్​ యోగిరాజ్​
kamal haasan yogiraj

By

Published : Nov 2, 2022, 2:40 PM IST

యూనివర్సల్ స్టార్​ కమల్​హాసన్​ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'భారతీయుడు 2'. అయితే ఇప్పుడీ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ నటిస్తున్నారు. పంజాబ్‌లో నటుడిగా మంచి గుర్తింపు ఉన్న యోగ్‌రాజ్‌ భారతీయుడు2 లో నటిస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రాం వేదికగా తెలిపారు. కమల్‌ హాసన్‌ను లెజెండ్‌గా అభివర్ణించారు.

"తెర వెనుక ఉండే హీరోలు ఎంతో కష్టపడి పనిచేస్తారు. నన్ను చాలా అందంగా తీర్చిదిద్దిన మేకప్‌ ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు. ఈ పంజాబ్‌ సింహం.. లెజెండ్‌ కమల్‌ హాసన్‌తో కలిసి భారతీయుడు2 సినిమాలో నటించడం కోసం సిద్ధమైంది" అంటూ ఆయన మేకప్‌ వేసుకుంటున్న ఫొటోను షేర్ చేశారు. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సిద్ధార్థ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details