Kamal Haasan vs Rajinikanth : సరిగ్గా 18 ఏళ్ల క్రితం 2005లో రజనీకాంత్ 'చంద్రముఖి', కమల్‌హాసన్ 'ముంబయి ఎక్స్‌ప్రెస్' సినిమాలు ఒకేరోజు రిలీజై బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అయితే వీటిల్లో 'చంద్రముఖి' సూపర్ హిట్‌గా నిలవగా.. 'ముంబయి ఎక్స్‌ప్రెస్' మాత్రం మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఇక దీని తర్వాత ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదల కాలేదు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు సూపర్స్స్టార్స్ నటించిన రెండు సినిమాలు 18 ఏళ్ల తర్వాత మళ్లీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఇంతకీ అవేంటంటే?
రిలీజే కానీ..
Kamal Rajini Re Release Movies :డిసెంబర్ 8న ఈ ఇద్దరు తమిళ సూపర్‌స్టార్స్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అవి కొత్త సినిమాలు కాదండోయ్. రీ- రిలీజ్ సినిమాలు. ఒకటి రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ 'ముత్తు'(1995) కాగా.. రెండోది కమల్‌హాసన్ సైకో థ్రిల్లర్ మూవీ 'అభయ్(అలవంధన్)'(2001). చాలా ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలు మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ రూపంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ లెజెండరీ నటుల సినిమాలను ఎలాగైనా బిగ్స్క్రీన్పై చూడాలని అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారట. అయితే సరిగ్గా 18 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ ఇద్దరి సినిమాలు మళ్లీ ఇప్పుడు వార్‌కు సిద్ధం కావడం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.