Vikram Movie Trailer: కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేష్ కనగరాజన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'విక్రమ్'. విజయ్‌సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ముగ్గురు హీరోల లుక్స్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందినట్టు, కమల్‌హాసన్ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సన్నివేశానికి తగ్గట్టు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 'ఖైదీ', 'మాస్టర్' చిత్రాల తర్వాత లోకేష్ దర్శకత్వం వహించిన సినిమా కావడం, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో 'విక్రమ్'పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ట్రైలర్ ఆ అంచనాలను ఇంకాస్త పెంచేలా ఉంది. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో సూర్య అతిథిగా కనిపిస్తారని సమాచారం.