kamal haasan project k : ప్రభాస్-అమితాబ్ బచ్చన్-దీపిక పదుకొణె.. ఇలా భారీ తారాగణంతో ఇప్పటికే సినీ ప్రియుల అందరి దృష్టిని ఆకర్షించింది 'ప్రాజెక్ట్ కె'. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌కు ఆదివారం మరో అదనపు ఆకర్షణ తోడైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ భాగం కానున్నట్లు మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో సినీ అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది. అలాగే 'ప్రాజెక్ట్ కె'పై అంచనాలు మరింత భారీగా పెరిగాయి.
ఇదే సమయంలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న కమల్.. ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్న అనే ప్రశ్న అభిమానుల మదిలో తెగ మెదులుతోంది. ఈ క్రమంలోనే కమల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన హీరోగా రీసెంట్గా విక్రమ్‌తో భారీ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా ప్రస్తుతం 'ఇండియన్ 2' భారీ సినిమా కూడా తెరకెక్కుతోంది. మరి ఇలాంటి సమయంలో ఆయన విలన్‌గా కనిపిస్తారా అనే ప్రశ్న కూడా అభిమానుల మదిలో మెదులుతోంది.
project k cast and crew : ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాత్ర విషయానికొస్తే... ఆయన ప్రతినాయకుడిగా కనిపించే అవకాశం దాదాపుగా లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన పాత్ర అశ్వత్థామ తరహాలో ఉంటుందని మొదటి నుంచి అంటూనే ఉన్నారు. ఓ సైంటిస్ట్‌లా, అలానే ప్రభాస్‌ను వెనక నుంచి నడిపించే మెంటార్‌లా ఉంటారని అంటున్నారు. ఇకపోతే దీపికా పదుకొణె.. అమితాబ్ బచ్చన్ దగ్గర సహాయకురాలిగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. అలాగే దిశా పటానీ ఓ కీలక పాత్ర అని కూడా చెబుతున్నారు. మరి ఈమె పాత్రలో ఏమైనా నెగటివ్ షేడ్స్ ఉన్నాయా లేదా అనేది సస్పెన్సే. ఇక మిగిలి ఉందని ప్రతినాయకుడి పాత్ర ఎవరన్నది. కాబట్టి ఆ పాత్ర పోషించేది కమల్ హాసన్ అయి ఉండొచ్చని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే తాజా సమాచారం ఏంటంటే.. ఆయన కూడా ఓ సైంటిస్ట్ పాత్రే పోషించబోతున్నారని ప్రచారం సాగుతోంది.