కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై ఆసక్తికరమైన ప్రచారం ఒకటి జరుగుతోంది. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం.. కమల్ హాసన్‌ను సంప్రదించాలని భావిస్తున్నారట ప్రశాంత్. ఈ పాత్ర సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందట. అందుకే ఈ సినిమా కోసం కమల్ హాసన్‌ను ఒప్పించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమా? కాదా? అనేది భవిష్యత్‌లో తెలియనుంది.
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్‌హాసన్! - kamal haasan ntr combination movie
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సంబంధించి క్రేజీ రూమర్ ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కమల్ హాసన్ ఒప్పించేందుకు ప్రశాంత్ సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు ప్రశాంత్. అలాగే ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ నుంచి మొదలు పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినషన్లో మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు, ప్రశాంత్ నీల్ యాక్షన్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ లోగో.. నిర్మాతగా మారిన తాప్సి