తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కమల్​ బర్త్​డేకు శ్రుతి స్పెషల్ విషెస్​ - ఆ అరుదైన ఫొటోలతో! - కమల్​ హాసన్​కు శ్రుతి హాసన్​ స్పెషల్​ గిఫ్ట్

Kamal Haasan Birthday : లోకనాయకుడు కమల్ హాసన్​ బర్త్​డే సందర్భంగా ఆయనకు వ్యక్తిగతంగా, సోషల్​ మీడియా వేదికగా పెద్ద ఎత్తును శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు, సినీ ప్రముఖులు. ఈ క్రమంలో ఆయన కుమార్తె శ్రుతి హాసన్ కూడా తన డాడీకి ఓ గిఫ్ట్​ ఇచ్చారు. ఇంతకీ అదేంటంటే..

Kamal Haasan Birthday Shruti Hassan Special Gift
Kamal Haasan Birthday

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 4:36 PM IST

Kamal Haasan Birthday : విలక్షణ నటుడు, తమిళ సూపర్​స్టార్​, లోక నాయకుడు ఇలా ఏ పేరుతో పిలిచినా అందరూ టక్కున గుర్తుపట్టే ఏకైక నటుడు కమల్​ హాసన్​. కేవలం కోలీవుడ్​లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈయనకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా వెండితెరపై తన నటనతో విశ్వరూపాన్ని చూపించారు ఈ అగ్ర కథానాయకుడు. నవంబర్​ 7న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పెద్ద ఎత్తున బర్త్​డే విషెస్​ ​చెబుతున్నారు. అయితే వీటిల్లో కమల్​ కుమార్తె, నటి శ్రుతి హాసన్​ తన తండ్రి కోసం రెడీ చేసిన ఓ గిఫ్ట్ మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ శ్రుతి తన డాడీకి ఇచ్చిన గిఫ్ట్​ ఏంటంటే..

Shruti Haasan Special Video : శ్రుతి హాసన్‌ ఓ ప్రత్యేక వీడియోతో తన తండ్రికి బర్త్‌డే విషెస్‌ చెప్పారు. దీనికి క్యాప్షన్​గా.. 'మీలాంటి గొప్ప వ్యక్తులు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. నటుడిగా, గాయకుడిగా, డ్యాన్సర్​గా, అన్నింటికి మించి ఓ గొప్ప స్నేహితుడిగా.. ఇలా ప్రతి విషయంలోనూ మీరు ఉత్తమంగా ఉంటారు. మీలాంటి తండ్రి ఉండాలని ప్రతి కూతురు కోరుకుంటుంది. మీరు నా లైఫ్​లో ఎంతో స్ఫూర్తిని నింపారు. ఇలాంటి బర్త్​డేలు మీరు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే చేస్తూనే ఉంటాను. మొత్తంగా మీరు అన్నింటా ఓ రాక్​స్టార్​ డాడ్​' అంటూ కమల్ హాసన్‌కి చెందిన చాలా అరుదైన ఫొటోస్​ను సేకరించి మరీ ఓ వీడియోను రూపొందించారు. దాన్ని తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ ట్రెండ్​ అవుతోంది.

ప్రముఖుల బర్త్​డే విషెస్​..

'మీతో కలిసి పనిచేసే అవకాశం మరోసారి రావడం చాలా అద్భుతం. మీరు మమ్మల్ని ఎప్పటికీ ఇలానే అలరిస్తూనే ఉంటారని.. ఇంకెందరిలోనూ స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటారని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు' అని దర్శకుడు శంకర్‌ ట్వీట్​ చేశారు.

'యాక్టర్​, లెజెండ్​, ఎంతోమందికి ఆరాధ్య దైవంగా ఎదిగిన ఐకాన్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అని డార్లింగ్​ ప్రభాస్​ విషెస్​ చెప్పారు.

'యూనివర్సల్​ స్టార్​ కమల్​ హాసన్​ సర్​కి పట్టినరోజు శుభాకాంక్షలు. మీ నుంచి నేర్చుకున్న పాఠాలు ఇలానే ఎన్నో ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాను' అని జూనియర్​ ఎన్టీఆర్​ కమల్​ హాసన్​కు విషెస్​ తెలిపారు.

మరోవైపు కొందరు సినీనటులు కమల్ హాసన్​తో దిగిన ఫొటోలను పోస్ట్​ చేస్తూ బర్త్​డే విషెస్​ చెబుతుంటే.. ఆయన కొత్త సినిమాకు సంబంధించిన అప్​డేట్​లో కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి.

ఈ దీపావళికి టపాసుల్లాంటి సినిమాలు/ వెబ్​సిరీస్​లు రెడీ - మీరేం చూస్తారు?

రాజమౌళి మూవీకి సెంథిల్​ దూరం, మహేశ్​ సినిమాలో కొత్త సినిమాటోగ్రాఫర్- జక్కన్న స్కెచ్​ ఏంటి?

ABOUT THE AUTHOR

...view details