Kamal Hasan Vijay Sethupathi: 'విక్రమ్' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విలక్షణ నటుడు కమల్ హాసన్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' చిత్రంలో నటిస్తూ, మరోవైపు బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈనెల 23న అనూహ్యంగా ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. 25వ తేదీన ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
డిశ్చార్జ్ తర్వాత ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు కమల్.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నానంటూ.. - కమల్‌హాసన్ విజయ్ సేతుపతి
ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విలక్షణ నటుడు కమల్‌హాసన్.. విజయ్‌సేతుపతి సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. తాను చిన్న దగ్గు సమస్య కారణంగానే ఆస్పత్రిలో చేరినట్లు స్పష్టం చేశారు.
కాగా, స్టార్ హీరో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'డీఎస్పీ'. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ పతాకంపై పొన్‌రామ్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజ్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ట్రేడ్ సెంటర్ ఆవరణలో మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమల్ హాసన్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడారు. తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు.
"ఒకప్పుడు పెద్ద ప్రమాదానికి గురైతే పరామర్శించిన తరువాత తదుపరి చిత్రం ఏమిటి? ఎప్పుడు నటించనున్నారు? అని అడిగేవారు. ఇప్పుడు కాలు చిన్నగా గీరుకుపోయినా పెద్దగా ప్రచారం చేస్తున్నారు. కారణం ఒకటి మీడియా, రెండు అభిమానం. నేను చిన్న దగ్గు సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరాను. నటుడు విజయ్ సేతుపతి కోసమే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఎందుకంటే నాలాగే ఆయన సినిమా ప్రేమికుడు" అంటూ చెప్పుకొచ్చారు. చిత్ర ట్రైలర్ చాలా బాగుందంటూ మేకర్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కమలహాసన్‌తో కలిసి 'విక్రమ్' చిత్రంలో నటించినప్పుడు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు విజయ్ సేతుపతి. ఆయన మరో నాలుగైదు తరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.