తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

' 'ఆర్​ఆర్​ఆర్' కంటే 'కేజీఎఫ్-2' 10రెట్లు చెత్త సినిమా ​'​ - kamaal r khan tweet

'కేజీఎఫ్​-2' ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్​ టాక్​ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ కమల్​ ఆర్​ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్​ నీల్.. ఈ సినిమా తీసి..​ లక్షలాది మంది ప్రేక్షకులను మోసం చేశారంటూ ట్వీట్​ చేశారు.

kgf-2
కేజీఎఫ్​

By

Published : Apr 14, 2022, 5:29 PM IST

Updated : Apr 14, 2022, 10:57 PM IST

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా 'కేజీఎఫ్​-2'. ఇది కన్నడ సినిమా అయినా.. భాషలకతీతంగా ఈ మూవీని చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమా మొదటిరోజు హిట్టా టాక్​ తెచ్చుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా సినీ ప్రమఖులు కేజీఎఫ్​-2 బృందాన్ని అభినందిస్తున్నారు. అయితే బాలీవుడ్ క్రిటిక్.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన కమల్​ ఆర్​ ఖాన్​ మాత్రం ట్విట్టర్​ వేదికగా భిన్నంగా స్పందించారు.

కేజీఎఫ్​-2 సినిమా తీసి.. ప్రశాంత్​ నీల్​ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రేక్షకులను మోసం చేశారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తీసినందుకు ప్రశాంత్​ నీల్​ను జీవితాంతం జైళ్లో పెట్టాలన్నారు. ఇలాంటి మెదడు లేని దర్శకులను ప్రోత్సహించకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కమల్​ ఆర్​ ఖాన్

ఈ సినిమాలోని ఓ సన్నివేశంపై వ్యంగ్యంగా స్పందించారు కేఆర్​కే. భారత మిలటరీ, ఎయిర్​ఫోర్స్​, నేవీ కలిసినా... రాఖీ అనే వ్యక్తితో పోరాడలేకపోయాయన్నారు. ఇలా ఉంటే.. 'పాకిస్థాన్​, చైనాతో భారత్​ ఎలా పోరాడుతుంది ప్రశాంత్ భాయ్' అని దర్శకుడిని ప్రశ్నించారు. ఈ సినిమా 'ఆర్​ఆర్​ఆర్​ కంటే 10రెట్లు చెత్త సినిమా' అంటూ సెన్సేషనల్​ కామెంట్స్​ చేశారు కేఆర్​కే.

ఇదీ చూడండి: 'కేజీఎఫ్​-2' హిట్​ టాక్- బాలీవుడ్​పై ఆర్జీవీ హాట్​ కామెంట్స్​​

Last Updated : Apr 14, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details