Kalyanram Bimbisara collections: జయాపజయాలను పట్టించుకోకుండా కొత్త కథల్ని భుజానికెత్తుకుంటూ.. కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్యభరితంగా ముందుకు తీసుకెళ్తున్నారు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ఈ క్రమంలోనే ఇప్పుడాయన 'బింబిసార'గా ప్రేక్షకుల్ని పలకరించారు. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన చిత్రమిది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ సినిమా కావడం విశేషం.శుక్రవారం విడుదలైన ఈ భారీ ప్రాజెక్ట్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి.
బింబిసారాను రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.13 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే తొలిరోజే దాదాపు 50శాతంకు పైగా కలెక్షన్లను అందుకుంది. 6.3కోట్ల షేర్‌ను వసూలు చేసింది.
- నైజాం-2.15 కోట్ల రూపాయలు.
- సి డెడ్-1.29 కోట్ల రూపాయలు.
- ఉత్తరాంధ్ర-90 లక్షలు.
- ఈస్ట్ గోదావరి-43 లక్షలు.
- వెస్ట్ గోదావరి-36 లక్షలు.
- గుంటూరు-57 లక్షలు.
- కృష్ణ-34 లక్షలు.
- నెల్లూరు-26 లక్షలు.