వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచింది. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో(నేడు) ప్రేక్షకులు ముందుకు వచ్చిన కల్యాణ్‌రామ్ 'బింబిసార', దుల్కర్ సల్మాన్ 'సీతారామం' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
బింబిసార విషయానికొస్తే.. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా.. నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన సోషియో ఫాంటసీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఆయన కెరీర్లోనే భారీ స్థాయిలో రూపొందింది. అయితే ఈ చిత్రం యూఎస్ఏ ప్రీమియర్ కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఓ సినిమా వెబ్సైట్ కథనం ప్రకారం.. 99 లొకేషన్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి 35,195 డాలర్స్ అంటే దాదాపు 27లక్షల 85వేల వరకు వచ్చాయని తెలిసింది.