తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కల్యాణ్​ రామ్ కొత్త మూవీ టైటిల్ అనౌన్స్మెంట్.. నాగశౌర్య న్యూ ప్రాజెక్ట్​ షురూ - నాగశౌర్య కొత్త సినిమా

కొత్త సినీ అప్టేట్లు వచ్చేశాయి. హీరోలు ధనుష్​, కల్యాణ్​రామ్​, నాగశౌర్య నటిస్తున్న పలు చిత్రాల సంగతులు ఇందులో ఉన్నాయి. ఆ వివరాలు..

tollywood updates
tollywood updates

By

Published : Nov 6, 2022, 10:34 PM IST

Updated : Nov 6, 2022, 10:45 PM IST

Dhanush Sir First Single: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్​.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. 'సార్' అనే టైటిల్​ను ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్​ను మేకర్స్​ విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. ఈ నెల 10వ తేదీన ఫస్ట్ సింగిల్​ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ ఓ పోస్టర్​ను రిలీజ్​ చేశారు. ఈ సినిమాలో ధనుష్ 'బాల గంగాధర్ తిలక్' అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన లుక్ చాలా నేచురల్ గా ఉంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తున్నారు.

రేపే కల్యాణ్​ రామ్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్
ఈ ఏడాది 'బింబిసార' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కల్యాణ్​ రామ్ పలు సినిమాలను లైన్​లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన.. దర్శకుడు రాజేంద్ర రెడ్డి రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. కల్యాణ్​ రామ్ కెరీర్​లో 19వ సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​లో నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్​ను సోమవారం రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ రిలీజ్​ చేశారు నిర్మాతలు. రిలీజ్ డేట్​ను కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

నాగశౌర్య కొత్త సినిమా షురూ
యంగ్ హీరో నాగశౌర్యకి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు దక్కడం లేదు. అయినప్పటికీ హీరోగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆదివారం కొత్త సినిమాను మొదలుపెట్టారు నాగశౌర్య. శౌర్య కెరీర్​లో 24వ సినిమా ఇది. భారీ బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మించనున్నారు. శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, అశోక్ కుమార్ చింతలపూడి సంయుక్తంగా వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్​పై ఈ ప్రాజెక్ట్​ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

'బుట్టబొమ్మ' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?
అనికా సురేంద్రన్.. తమిళ టాప్ హీరో అజిత్ కుమార్ నటించిన సినిమాల్లో బాల నటిగా మెప్పించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు పెద్దమ్మాయి అయిపోయింది. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. హీరోయిన్​గా తన సత్తా చాటబోతోంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తెలుగులో 'బుట్టబొమ్మ' అనే సినిమాలో నటిస్తున్నారు. సోమవారం ఉదయం 11:08 నిమిషాలకు ఈ సినిమా టీజర్​ను విడుదల చేయబోతున్నారు.

Last Updated : Nov 6, 2022, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details