Kalki Movie Photo Leaked : ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ 'కల్కి' సినిమా నుంచి రీసెంట్గా ఓ ఫొటో లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మూవీటీమ్ లీగల్ యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయం నిజమేనని క్లారిటీ అయింది. లీకర్స్కు, అలాగే లీకైనా వాటిని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా షేర్ చేసే వాళ్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు మేకర్స్. "కల్కి 2898 ఏడీ సినిమా, దానికి సంబంధించిన ఏ విషయమైనా కాపీరైట్స్ పరిధిలోకి వస్తాయి. సినిమాకు సంబంధించి సీన్స్, ఫుటేజ్‌లు లేదా ఫొటోస్ ఏదీ షేర్ చేసినా అది చట్ట విరుద్ధం. అందుకు చట్ట పరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ చర్యలకు పాల్పడితే తప్పకుండా సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా మేం లీగల్ యాక్షన్ తీసుకుంటాం" అని మూవీ ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్ ఇచ్చింది.
కాగా, ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ లీక్‌ల బెడద ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద చర్చలే కొనసాగుతున్నాయి. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి కూడా ఓ సాంగ్, పిక్స్ వంటి లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో లీకైన క్షణాల్లోనే విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఈ విషషంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు గట్టి చర్యలు కూడా తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేశారు.