తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అరబిక్‌ కుతు’.. తెలుగు వెర్షన్‌ వచ్చేసింది- షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ ట్రైలర్‌ - panchatantra movie songs

విజయ్ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ‘బీస్ట్‌’ చిత్రంలోని ‘అరబిక్‌ కుతు’ (హలమితి హబీబో) తెలుగు వెర్షన్‌ వచ్చేసింది. శ్రీ సాయికిరణ్‌ సాహిత్యం అందించగా అనిరుధ్‌, జోనితా గాంధీ ఆలపించారు. అలాగే బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీల్‌గుడ్‌ చిత్రం ‘పంచతంత్రం'లో ఓ పాటను విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు.

Beast
బీస్ట్​

By

Published : Apr 4, 2022, 6:04 PM IST

Updated : Apr 4, 2022, 11:06 PM IST

ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలై శ్రోతల్ని ఉర్రూతలూగించిన ‘అరబిక్‌ కుతు’ (హలమితి హబీబో) తెలుగు వెర్షన్‌ వచ్చేసింది. విజయ్ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ‘బీస్ట్‌’ చిత్రంలోని గీతమిది. ఏప్రిల్‌ 13న తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగు పాట రిలీజైంది. శ్రీ సాయికిరణ్‌ సాహిత్యం అందించగా అనిరుధ్‌, జోనితా గాంధీ ఆలపించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు.

ఇప్పటికే విడుదలైన తమిళ్‌ వెర్షన్‌.. యూట్యూబ్‌లో 260 మిలియన్లకుపైగా వీక్షణలు సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించింది. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. తదితర సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా నిలిచింది. భాష అర్థమవకపోయినా క్యాచీ పదాలు, విజయ్‌, పూజా స్టెప్పులు, సంగీతానికి ఎంతోమంది ఫిదా అయ్యారు. సెలబ్రిటీలు సైతం ఈ పాటకు డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది.

షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ ట్రైలర్‌

షాహిద్‌ కపూర్‌ హీరోగా దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం 'జెర్సీ'. నాని కథానాయకుడిగా తెలుగులో వచ్చిన ‘జెర్సీ’ రీమేక్‌గా రూపొందింది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఇప్పటికే ఓ ట్రైలర్‌ను పంచుకోగా తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. షాహిద్‌ సిక్సర్‌ కొట్టే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునేలా ఉంది. క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్‌ బ్యాట్‌ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? తదితర భావోద్వేగ అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అల్లు అరవింద్‌, దిల్‌రాజు, అమన్‌ గిల్‌, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తుంచారు. అనిరుధ్‌ నేపథ్య సంగీతం అందించగా సాకేత్‌, పరంపర స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది.

మెలోడిని విడుదల చేసిన విజయ్​

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీల్‌గుడ్‌ చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడు. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ‘పంచతంత్రం’ నుంచి ఓ మెలోడిని నటుడు విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ‘అరెరె అరెరె’ అంటూ సాగే ఈ ఫీల్‌గుడ్‌ పాటను విడుదల చేయడం తనకెంతో ఆనందంగా ఉందని విజయ్ తెలిపారు. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. నరేశ్‌ ఆగస్త్య, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌, దివ్య శ్రీపాద, సముద్రఖని, స్వాతి తదితరులు ఈసినిమాలో కీలకపాత్రలు పోషించారు.

Last Updated : Apr 4, 2022, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details