Meena Husband: ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్వాసకోస సమస్యతో ఆయన ఇటీవలే మరణించారు. ఫలానా కారణంగానే సాగర్ మృతి చెందారంటూ కోలీవుడ్ వర్గాలు, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతోంది. ఈ విషయమై మీనా స్నేహితురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ స్పందించారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
"కొవిడ్ బారిన పడకముందు విద్యాసాగర్‌కు బర్డ్ ఇన్‌ఫెక్షన్ అయిందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ తర్వాత, ఈ ఏడాది జనవరిలో ఆయన కొవిడ్ నుంచి కోలుకున్నారు. మీనా తల్లి పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఫిబ్రవరిలో మేము కలిశాం. అప్పుడు ఆయన బాగానే ఉన్నారు. మార్చిలో.. ఓసారి మీనా ఫోన్ చేసి, 'సాగర్ హెల్త్ బాలేదు' అని తెలిపింది. నేను ఆస్పత్రికి వెళ్లి పలకరించా. ఆ రోజు నా పుట్టిన రోజు కావడం వల్ల సాగర్ నాకు శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడూ ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది."
-- కళా మాస్టర్