హీరోయిన్ కాజల్ అగర్వాల్ తిరిగి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. ఇన్‌స్ట్రాలో గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. బాబు పుట్టిన తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
"బాబు పుట్టిన 4 నెలల తర్వాత ఎంతో ఆత్రుతగా, ఉత్సాహంగా నేను తిరిగి పనిలోకి అడుగుపెడుతున్నాను. అయితే.. ఇది అంతకు ముందులా ఉంటుందని నేను అనుకోవడం లేదు. గతంలో నా శరీరం ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు. బాబు పుట్టాక వ్యాయమం చేయకుండా నా శరీరానికి పూర్తి విశ్రాంతి ఇచ్చాను. ప్రసవానంతరం గతంలో ఉన్నట్లు ఎనర్జీ లెవల్స్‌ని తిరిగి పొందడం చాలా కష్టంతో కూడుకున్నది. గుర్రాన్ని ఎక్కడం, దానిపై స్వారీ చేయడం చాలా పెద్ద పనిలా అనిపించింది. అంతకు ముందు నాకు చాలా సులభంగా అనిపించిన వ్యాయామం చేస్తుంటే.. ఇప్పుడు నా శరీరం దానికి సహకరించట్లేదు. ప్రసవానంతరం మన శరీరంలో మార్పులు రావొచ్చు. కానీ మనలోని నేర్చుకోవాలనే తపనకు ఏదీ అడ్డుకాదు. మనం ప్రతి రోజు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మన ఎంపికలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగిపోవాలి"