తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిడ్డ పుట్టాక కాజల్​ ఫస్ట్ పోస్ట్​.. ప్రియాంక కూతురు పేరేంటంటే? - priyanka chopra movies

Kajal agarwal first Emotional post after delivery: బిడ్డ పుట్టాక హీరోయిన్​ కాజల్​ అగర్వాల్ తొలిసారి స్పందించింది. ఇన్​స్టా వేదికగా​ ఓ భావోద్వేగపు పోస్ట్ చేసింది. మరోవైపు గ్లోబల్​ స్టార్ ప్రియాంక చోప్రా తన కూతురు పేరును సోషల్​మీడియా ద్వారా తెలిపింది. దాని అర్థాన్ని కూడా వివరించింది.

kajal first post
కాజల్ పోస్ట్​

By

Published : Apr 21, 2022, 1:24 PM IST

Updated : Apr 21, 2022, 1:52 PM IST

Kajal agarwal first Emotional post after delivery: సినీనటి కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం మాతృత్వపు ముధురానుభూతులు ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఆమె తల్లి అయిన సంగతి తెలిసిందే. బేబి బంప్స్‌, సీమంతం ఫొటోలను పోస్ట్‌ చేస్తూ కొన్నాళ్లుగా తన ఆనందాన్ని పంచుకొన్న ఈ అమ్మడు మంగళవారం పండంటి మగబిడ్డ(నీల్‌)కు జన్మనిచ్చింది. అయితే, ఇప్పుడు తన బిడ్డకు స్వాగతం పలుకుతూ ఒక భావోద్వేగ పోస్టు పెట్టింది.

"నా బిడ్డ నీల్‌ను ప్రపంచంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో సంతోషిస్తున్నాను. నీల్‌ మొదటిసారి నా ఛాతిపై పడుకొన్నప్పటి క్షణం నాజీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. ఆ ఒక్క క్షణం నేను ప్రేమకు సంబంధించిన లోతైన భావన పొందాను. జీవితాంతం నేను పూర్తి చేయాల్సిన బాధ్యతను గుర్తుచేసుకున్నాను. నిజానికి ఒక బిడ్డకు జన్మనివ్వడం అంత సులభమైన విషయం కాదు. నేను మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. ఎప్పుడెప్పుడు నా బిడ్డను ఎత్తుకుందామా అన్న ఆతృతను ఆనందంగా అనుభవించాను" అని పేర్కొన్నారు.

Priyanka daughter name: గ్లోబల్​ స్టార్​ కపుల్​ ప్రియాంక చోప్రా-నిక్​ జోనస్​.. ఇటీవలే స‌రోగ‌సి పద్ధతి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చి త‌ల్లిదండ్రుల‌య్యారు. అయితే తాజాగా ఇప్పుడు తమ కూతురుకు నామకరణం చేశారు. 'మాల్టీ మేరీ చోప్రా జోనస్'​ అని పేరు పెట్టారు. ఈ పేరులో మాల్టీ అంటే పువ్వు అని అర్థం. అంతేకాదు ప్రియాంక తల్లి పేరు మధుమాల్టీ. జోనస్​ తల్లి పేరు మేరీ. ఈ రెండింటితో పాటు తమ పేర్లను కూడా కలగలిపి 'మాల్టీ మేరీ చోప్రా జోనస్' అని నామకరణం చేశారు. త్వరలోనే ప్రియాంక చోప్రా.. 'ఇట్స్ ఆల్​ కమింగ్ బ్యాక్​ టు మి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జేమ్స్​ సి స్ట్రోస్​ దర్శకుడు.

ఇదీ చూడండి: 'ఆచార్య'కు మహేశ్​ గళం.. కలెక్షన్లలో 'కేజీఎఫ్​ -2' సరికొత్త రికార్డు!

Last Updated : Apr 21, 2022, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details