తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఐదేళ్ల తర్వాత భారత్​కు జస్టిన్ బీబర్​.. ఈ సారి ప్రదర్శన ఎక్కడంటే? - జస్టిన్​ బీబర్ సాంగ్స్​

Justin Bieber India tour: హాలీవుడ్​ పాప్​ సింగర్​, గ్రామీ అవార్డు విజేత జస్టిన్​ బీబర్​.. త్వరలోనే భారత్​కు రానున్నారు. దిల్లీలోని ఓ స్డేడియానికి చేరుకుని ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని తెలిపిన బుక్​ మై షో.. జూన్​ నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

justin bieber india visit
భారత్​కు జస్టిన్​ బీబర్​

By

Published : May 24, 2022, 3:29 PM IST

Justin Bieber India tour: చిన్న వయసులోనే 'ఓ బేబీ.. బేబీ..' అంటూ శ్రోతలను ఉర్రూతలూగించిన పాప్‌స్టార్‌ జస్టిన్‌ బీబర్‌. కెనడాకు చెందిన ఆయన 'సారీ', 'లవ్‌ యువర్‌ సెల్ఫ్‌', 'ఘోస్ట్​' వంటి పాటలతో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఈయన మరోసార్​ భారత్​కు రానున్నారు.

ప్రపంచ టూర్​లో భాగంగా ఈ కెనడియన్​ పాప్​ స్టార్​ భారత్​కు వచ్చి న్యూ దిల్లీలోని జవహర్​లాల్​ నెహ్రూ స్డేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని తెలిపిన ప్రముఖ ఆన్​లైన్​ బుకింగ్​ యాప్​ బుక్​ మై షో.. జూన్​ 2న ప్రీ సేల్​ ఉంటుందని,​ జూన్​ 4 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఒక్కో టికెట్​ ధర రూ.4వేల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. అక్టోబర్​లో ఈ షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారట! ఈ వార్త తెలుసుకుంటున్న భారత్​లో ఉన్న ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రపంచ టూర్​లో భాగంగా బీబర్​ 30 దేశాల్లో 125కుపైగా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నెల మెక్సికోలో ప్రారంభమైన ఈ పర్యటన.. వచ్చే ఏడాది 2023 మార్చి వరకు కొనసాగనుంది. 2017లోనూ బీబీర్​ ముంబయిలోని ఓ మైదానంలో ప్రదర్శన ఇచ్చారు.

భారత్​కు జస్టిన్​ బీబర్​

ఇదీ చూడండి: దీపిక అస్సలు తగ్గట్లేదుగా.. కేన్స్​లో మరోసారి గ్లామర్​ షో

ABOUT THE AUTHOR

...view details