తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఎన్టీఆర్​ బాలీవుడ్​ ఎంట్రీ ఫస్ట్​ ఆ చిత్రంతోనా.. తర్వాతే 'వార్​ 2'? - ఎన్టీఆర్​ బాలీవుడ్ ఎంట్రీ హృతిక్ వార్​ 2

ఎన్టీఆర్​ బాలీవుడ్ ఎంట్రీ హృతిక్ రోషన్​ 'వార్​ 2'తో కాదట! అంతకన్నా ముందే మరో చిత్రంలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు..

NTR Hrithik roshan
NTR Hrithik roshan

By

Published : Apr 6, 2023, 12:53 PM IST

యంగ్ టైగర్​ జూనియర్​ ఎన్టీఆర్.. సూపర్ హిట్ చిత్రం 'వార్' సీక్వెల్​తో బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హ్యాండ్​సమ్​ స్టార్​ హృతిక్ రోషన్​తో స్క్రీన్​ షేర్ చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్​ కన్ఫార్మ్​ చేశారు. దీంతో ఈ క్రేజీ కాంబోపై అటు నందమూరి అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలక్తొంది. 'వార్ 2'లో తారక్​ పాత్ర ఏమై ఉంటుంది? ఎంత సేపు నిడివి ఉంటుంది? స్టోరీని మలుపు తిప్పేలా ఉంటుందా? అంటూ రకరకాల ఆలోచనలు వారి మెడదుల్లో మెదులుతున్నాయి. ఈ చిత్రంలో తారక్​ను నటింపజేసేందుకు.. యశ్​ రాజ్​ ఫిల్మ్స్​ అధినేత ఆదిత్య చోప్రా భారీగానే ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్​ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. 'వార్​ 2' కన్నా ముందే మరో చిత్రంతో తారక్​ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారని కూడా ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఆదిత్య చోప్రా YRF స్పై యూనివర్స్ బ్యానర్​పై నిర్మిస్తున్న సల్మాన్ ఖాన్​ 'టైగర్ 3' చిత్రంలో తారక్​ గెస్ట్​ రోల్​లో కనిపించే అవకాశం ఉందట. ఈ సినిమాలో తారక్​ పాత్రను పరిచయం చేసి.. దాన్ని 'వార్​ 2'లో కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలీదు గానీ దీనిపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఎన్టీఆర్​ సాలిడ్​ సక్సెస్​ దక్కించు​కోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్​ సౌత్​తో పాటు నార్త్​లోను ప్రస్తుతం ఫుల్​ క్రేజ్​ ఉండటం వల్ల.. 'టైగర్'​ మూవీలో కనిపించేలా ఆదిత్య చోప్రా ప్లాన్​ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అప్పుడు సౌత్​లో 'టైగర్'​ సినిమాకు మంచి బిజినెస్​ జరుగుతుందని భావిస్తున్నారట. ఇది కనుక నిజమైతే.. ఎన్టీఆర్​కు​ బ్యాక్​ టు బ్యాక్ బాలీవుడ్​ ప్రాజెక్ట్స్​ ఉండే అవకాశం ఉంటుంది. ఇక 'వార్​ 2' ఈ ఏడాది చివర్లో సెట్స్​పైకి వెళ్లే అవకాశం ఉంది.

దీనికి 'బ్రహ్మస్త్ర' మూవీ డైరెక్టర్​ అయాన్ ముఖర్జీ తెరెక్కకించనున్నారు. అయితే ఈ సినిమా కన్నా ముందు తారక్​.. కొరటాల డైరెక్షన్​లో 'NTR 30'ను పూర్తి చేయనున్నారు. ఇది పక్కా యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందనుంది. 'ఆర్​ఆర్​ఆర్​' లాంటి బిగ్గెస్ట్ హిట్​ అందుకున్న తర్వాత ఎన్టీఆర్​ నటిస్తున్న చిత్రమిది. అందుకే ఇది ఎలా ఉండబోతుందా అని అభిమానుల్లో తెగ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా రీసెంట్​గా షూటింగ్​ ప్రారంభించుకుంది.

ఫస్ట్ ఛాయిస్​ రౌడీ హీరోనా?.. అయితే 'వార్​ 2'లో ఎన్టీఆర్​ కన్నా ముందు రౌడీ హీరో విజయ్​ దేవరకొండను తీసుకోవాలని ప్లాన్​ చేసిందట మూవీటీమ్​. కానీ 'లైగర్'​ సినిమా డిజాస్టర్​ అవ్వడం వల్ల తమ నిర్ణయాన్ని మార్చుకున్నారట. బాగా ఆలోచించి ఎన్టీఆర్​ను సెలెక్ట్ చేసుకున్నారట.

ఇదీ చూడండి:'దసరా'కు 100 కోట్లు.. మరి నాని కెరీర్​లో టాప్​-5 హైయెస్ట్​ కలెక్షన్​ మూవీస్​ తెలుసా?

ABOUT THE AUTHOR

...view details