తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అలా చెప్పడానికి అస్సలు మొహమాట పడను: కియారా - కియారా అద్వాణీ జుగ్‌ జుగ్‌ జియో

Kiara Advani Jug Jug Jeeyo: రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే సారీ చెప్పడానికి తాను మొహమాట పడనని నటి కియారా అడ్వాణీ అన్నారు. ఏ రిలేషన్‌లోనైనా గొడవలు జరిగినప్పుడు ఇద్దరూ సారీలు చెప్పుకోవడంలో తప్పులేదు.

Kiara Advani
నటి కియారా

By

Published : Jun 25, 2022, 3:08 PM IST

Kiara Advani Jug Jug Jeeyo: తెలుగులో న‌టించింది రెండు చిత్రాల్లోనే అయినా ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌పై మంచి ప్ర‌భావం చూపారు బాలీవుడ్ న‌టి కియారా అడ్వాణీ. మహేశ్‌ నటించిన 'భరత్‌ అనే నేను' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమై.. త‌న‌ అందం, అభిన‌యంతో అన‌తికాలంలోనే స్టార్ నాయిక‌గా మారిన ఆమె.. ప్రస్తుతం హిందీలో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం 'జుగ్‌ జుగ్‌ జియో' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె "రిలేషన్‌లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే ముందు అమ్మాయి సారీ చెప్పాలా? లేదా అబ్బాయి క్షమాపణలు చెప్పాలా?" అనే విషయంపై స్పందించారు. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే సారీ చెప్పడానికి తాను మొహమాట పడనని నటి కియారా అడ్వాణీ అన్నారు.

"ఏ బంధంలోనైనా గొడవలు రావడం సహజం. గొడవలు ఎప్పుడు జరిగినా ముందు తామే భార్యకు క్షమాపణలు చెబుతామని పెళ్లైన పురుషులు అంటుంటే విన్నా. కానీ, నా ఉద్దేశం ప్రకారం.. గొడవలు ఎవరి వల్ల జరిగినా క్షమాపణలు చెప్పడమనేది ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది. పెళ్లి, దాని తర్వాత వచ్చే గొడవల గురించి నేను చెప్పను. కానీ, ఏ రిలేషన్‌లోనైనా గొడవలు జరిగినప్పుడు ఇద్దరూ సారీలు చెప్పుకోవడంలో తప్పులేదు. నేనైతే గొడవకి అంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టి.. బంధాన్ని ముందుకు కొనసాగించాలనుకుంటా. కాబట్టి సారీ చెప్పడానికి అస్సలు ఇబ్బంది పడను. ఎందుకంటే ప్రేమ ముఖ్యం" అని కియారా వివరించారు.

మోడ్రన్‌ లవ్‌స్టోరీగా సిద్ధమైన చిత్రం 'జుగ్‌ జుగ్‌ జియో'. వరుణ్‌ ధావన్‌, కియారా జంటగా నటించారు. అనిల్‌ కపూర్ , నీతూ కపూర్‌ కీలకపాత్రలు పోషించారు. రాజ్‌ మెహ్త దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. వరుణ్‌-కియారా పెయిర్‌ బాగుందని, అనిల్‌, నీతూ మెప్పించారని సినీ ప్రేక్షకులు చెప్పుకొంటున్నారు.

ఇదీ చూడండి: ఫ్యాన్​కు హీరో అదిరిపోయే గిఫ్ట్​.. అనుపమ అయితే ఏకంగా..!

ABOUT THE AUTHOR

...view details