తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆస్కార్‌ రేస్​లో​ NTR!.. తారక్​ ఫ్యాన్స్​కు పండగే!! - ఆర్​ఆర్​ఆర్​ న్యూస్​

ఆస్కార్‌ రేసులో ఉత్తమ నటుడి విభాగంలో టాలీవుడ్​ స్టార్​ హీరో ఎన్టీఆర్​ నిలుస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే ఓ ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్‌ ప్రకటించిన టాప్‌-10 బెస్ట్‌ యాక్టర్స్‌ ప్రిడిక్షన్‌ లిస్ట్‌లో ఎన్టీఆర్‌కు అగ్రస్థానం దక్కింది. ఆ వివరాలు..

ntr for oscars
ntr for oscars

By

Published : Jan 21, 2023, 6:53 PM IST

Updated : Jan 21, 2023, 7:36 PM IST

దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్​ ప్రాజెక్ట్​ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. సినిమాలో ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా మలిచారంటూ జక్కన్నపై హాలీవుడ్​ డైరెక్టర్లు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ఆర్​ఆర్​ఆర్​ మూవీ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్​ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆర్​ఆర్​ఆర్​లో యాక్షన్‌ సీన్స్‌లోనే కాకుండే ఎమోషనల్‌ పరంగానూ తారక్‌ నటన కంటతడి పెట్టించింది. దీంతో ఆస్కార్‌ రేసులో ఉత్తమ నటుడి విభాగంలో తారక్‌ నిలుస్తారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది టాప్‌-10 బెస్ట్‌ యాక్టర్స్‌ ప్రిడిక్షన్‌ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్‌కు అగ్రస్థానం దక్కడం విశేషం. టామ్ క్రూజ్, పాల్ డనో, మియా గోత్, పాల్ మెస్కల్, జో క్రవిట్జ్ తదితరుల పేర్లు కూడా టాప్‌-10 లిస్ట్‌లో ఉన్నాయి.

ఇక ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. ఆస్కార్‌ నామినేషన్స్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఏదో ఒక విభాగంలో అయినా ఆస్కార్‌ దక్కుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి కొమురం భీమ్‌ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ వరిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Last Updated : Jan 21, 2023, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details