Jr NTR Prashanth Neel Movie :పాన్ఇండియా స్టార్ జూ. ఎన్టీఆర్ - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కునున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఎన్టీఆర్ 31 (వర్కింగ్ టైటిల్) పేరుతో ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేసింది మూవీటీమ్. అయితే 'కేజీఎఫ్'తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రేజీ కాంబో నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా? అని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రీసెంట్గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సినిమా స్టోరీ లైన్ గురించి ఓ హింట్ ఇచ్చారు.
"విభిన్నమైన ఎమోషన్స్‌తో ఈ సినిమా కొత్తగా ఉండబోతోంది. నేను సినిమా జానర్ గురించి మాట్లాడను. కానీ, ఫ్యాన్స్ అందరూ ఇది పెద్ద యాక్షన్ ఫిల్మ్ అని ఊహించుకుంటున్నారు. అయితే నా ఆడియన్స్‌కు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇదివరకు లాగా కాకుండా ఈ సినిమాను కొత్త జానర్ కథతో తెరకెక్కిస్తున్నా. ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా కథ ఉంటుంది" అని అన్నారు. దీంతో సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా,ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది (2024) ద్వితీయార్థంలో ప్రారంభం అవుతుందని, మొత్తం 18 దేశాల్లో చిత్రీకరణ ఉండనుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంత ఉందో కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.