తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

JR NTR Mokshagna : ఎన్​టీఆర్​​ను ఆప్యాయంగా హత్తుకున్న మోక్షజ్ఞ.. ఇప్పుడీ ఫొటోనే సోషల్​మీడియా సెన్సేషన్​.. - మోక్షజ్ఞను హత్తుకున్న ఎన్​టీఆర్

JR NTR Mokshagna Hug Pic : దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహం ఇటీవలే గ్రాండ్​గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికి హాజరైన జూనియర్ ఎన్​టీఆర్​.. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఒకే ఫ్రేమ్​లో కనపడి నందమూరి అభిమానుల్లో ఖుషీని నింపారు. అయితే ఇప్పుడు తాజాగా తారక్​- మోక్షజ్ఞకు సంబంధించిన ఒ కొత్త ఫొటో బయటకు వచ్చింది. ఇది ఇంటర్నెట్​ను షేక్ చేస్తోంది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 3:18 PM IST

JR NTR Mokshagna Hug Pic: టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఎన్​టీఆర్​​ తర్వాత బాలకృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్​టీఆర్​ఆ కుటుంబ క్రేజ్​ను పాన్​ ఇండియా రేంజ్​లో తీసుకెళ్లి నిలబెట్టారు. అయితే రీసెంట్​గా నందమూరి ఫ్యామీలో పెళ్లి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. దివంగత నటుడు హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష వివాహం(Nandamuri suhasini son marriage) ఘనంగా జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ వివాహ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరై నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు. అలాగే పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు.

తమ సోదరి సుహాసిని కొడుకు పెళ్లి కావడం వల్ల.. జూనియర్ ఎన్​టీఆర్​, కల్యాణ్ రామ్ ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ దగ్గరుండి మరీ చూసుకున్నారు. అయితే ఈ వేడుకలో జూనియర్ ఎన్​టీఆర్​, కల్యాణ్ రామ్​తో పాటు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞస్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచారు. ఈ ముగ్గురు కలిసి ముచ్చటించిన ఫొటోలు కూడా బయటకు వచ్చి సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌ల్​గా మారాయి. ఈ పిక్స్​లో హీరోలిద్దరూ స్టైల్​గా కనిపించగా.. మోక్షజ్ఞ క్లీన్ షేవ్‌తో పాటు స్లిమ్‌ లుక్‌తో కనిపించి ఆకట్టుకున్నారు. మొత్తంగా ముగ్గురు రాయల్​ లుక్​లో అదిరిపోయేలా దర్శనమిచ్చారు.

అయితే ఇప్పుడు శ్రీహర్ష వివాహానికి సంబంధించి మరిన్ని ఫొటోలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి బ్రదర్స్ తీసుకున్న పిక్స్​ కనిపిస్తున్నాయి. తమ్ముడు మోక్షజ్ఞను జూనియర్ ఎన్​టీఆర్​ ఆప్యాయంగా హత్తుకున్న ఫొటో కూడా ఒకటి బయటకు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో అన్నాదమ్ములు ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఎంతో చక్కగా కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అన్నా తమ్ముడు కలిసి ఆప్యాయంగా కనిపించడం వల్ల అభిమానులను ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇకపోతే ఇప్పటికే మోక్షజ్ఞ(mokshagna movies) వెండితెర అరంగేట్రం ఎప్పుడిస్తాడో అని ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల, బోయపాటి, అనిల్​ రావిపూడి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఇక ఎన్​టీఆర్​ విషయానికొస్తే.. ఆర్​ఆర్​ఆర్​తో బిగ్గెస్ట్ హిట్​ అందుకున్న ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర'(NTR Devara movie) సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అలాగే బింబిసారతో ఫామ్​లోకి వచ్చిన కల్యాణ్​ రామ్​.. రీసెంట్​గా 'అమిగోస్​'తో ఆకట్టుకోలేకపోయారు. త్వరలోనే డెవిల్(Kalyan ram Devil movie)​ అనే భారీ చిత్రంతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇందులో సంయుక్త మేనన్ హీరోయిన్​గా నటించింది.

మోక్షజ్ఞ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ ప్లాన్ సూపర్​​.. ఆ మాస్​ దర్శకుడితోనే!

మోక్షజ్ఞ టాలీవుడ్​ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details