Jr NTR Hindi Movie : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీ 'వార్2'. 2019లో విడుదలైన వార్-1కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వార్ 2 సినిమాకంటే ముందు ఆయన మరో సినిమాతో బీ టౌన్లో ఎంట్రీ ఇవ్వనున్నారట. ఓ స్టార్ హీరో చిత్రంలో ఆయన గెస్ట్ రోల్లో కనిపించనున్నారట.
Jr NTR In Tiger 3 Movie : కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా నటిస్తోన్న 'టైగర్ 3' సినిమాలోని క్లైమాక్స్ సీన్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారట. 'వార్ 2'ను రూపొందిస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ పైనే ఈ 'టైగర్ 3' సినిమా కూడా రూపొందుతోంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ ఈ కెమియో రోల్ గురించి ఎన్టీఆర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అక్కడి మీడియాలో ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై మూవీ టీమ్ ఎటువంటి క్లారిటీ లేదు. ఒకవేళ ఇది నిజమైతే.. ఈ సినిమా భారీ మల్టీ స్టారర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.