Jr NTR Goa Trip : 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిపోయింది. ఇక తాజాగా ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ సభ్యత్వాన్ని దక్కించుకోవటం వల్ల మరోసారి తారక్ పేరు ట్రెండింగ్‌లో వచ్చింది. ఇలా సినీ ప్రపంచంలో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న తారక్.. ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన మరి కొద్ది రోజుల్లో గోవాకి వెళ్లనున్నారట. ఎందుకంటే..
జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' సినిమా చిత్రీకరణలో ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో జరిగింది. తాజాగా హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్లో యాక్షన్ సీన్స్‌ను సైతం షూట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం మూవీ టీమ్‌తో కలిసి ఆయన గోవాకు వెళ్లనున్నారని సమాచారం. అక్కడ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు టాక్ నడుస్తోంది.
అయితే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగలుగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారట. కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, జాన్వీతో పాటు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది 5న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది.