యంగ్ హీరో విశ్వక్‌సేన్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా దమ్కీ'. నివేదా పేతురాజ్ హీరోయిన్. మార్చి 22న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. సినిమా విజయం సాధించాలని ఆశించారు.
విశ్వక్‌ను చూసి షాక్ అయ్యా.. ఆ రోజే రియలైజ్ అయ్యా: ఎన్టీఆర్ - విశ్వక్ సేన్ దాస్ కా దమ్కీ
యువ కథానాయకుడు విశ్వక్‌సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా దమ్కీ'. నివేదా పేతురాజ్ హీరోయిన్. మార్చి 22న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. సినిమా విజయం సాధించాలని ఆశించారు. ఇంకా తారక్ ఏం అన్నారంటే?
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ రోజు ప్రపంచ పటంలో నిలబడిందంటే.. అలాగే ఆస్కార్ సాధించడానికి... రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో.. యావత్ తెలుగు చిత్రసీమ, భారత దేశ చిత్రసీమ కూడా అంతే కారణం. దీంతో పాటు యావత్ దేశ ప్రేక్షకుల కారణం. అంతకంటే ముఖ్యంగా మీ అభిమానమే కారణం. మేము మాత్రమే కాదు మీరూ ఈ అవార్డు సాధించారు. మీ అందరి బదులు మేము అక్కడ నిలబడ్డాం. మా బదులు కీరవాణి, చంద్రబోస్ నిలబడ్డారు. ఆస్కార్ స్టేజ్ మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. ఇద్దరు తెలుగువాళ్లు అక్కడ కనిపించారు. నా రెండు కళ్లు చాలలేదు అది చూడాటానికి. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, భారత సినిమాలు మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇక విశ్వక్ సేన్ విషయానికొస్తే.. అతడికి ఉన్న కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండదు. ఎనర్జీ బాల్. నా కన్నా ఎక్కువగా మాట్లాడతాడు. నేను సైలెంట్ అయి అతడి మాటలు వినే స్టేజ్‌కి వెళ్లిపోయాను. నేను మూడాఫ్, టెన్షన్‌లోకి వెళ్లిన కొన్ని చిత్రాలు చూస్తాను. అందులో ఈ నగరానికి ఏమైంది సినిమా ఉంటుంది. అందులో విశ్వక్ నటన చాలా బాగుంటుంది. అద్భుతంగా నటించాడు. బాధను, కామెడీని రెండిటిని తన యాక్టింగ్‌లో బాగా చూపించాడు. ఇక ఫలక్నామా దాస్ అయితే.. డైరెక్టర్‌గా, యాక్టర్‌గా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. పాగల్ చేసినప్పుడు అతడు ఓ చక్రంలోకి వెళ్లిపోతున్నాడని అనుకున్నా. కానీ ఇక అశోకవనంలో అర్జునకల్యాణం చిత్రం చూసినప్పుడు షాక్ అయ్యాడు. అంత యాటిట్యూడ్, కాన్ఫిడెంట్‌తో మాట్లాడే మనిషి.. అంత చేంజ్ అవుతాడా అనిపించింది. నేను చేంజ్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. నేను ఒక చట్రంలోకి వెళ్లిపోతున్నాని అనిపించి.. ఆ తర్వాత నటుడిగా నేను ఆనందపడే చిత్రాలు చేయాలని చాలా లేట్‌గా రియలైజ్ అయ్యాను. అప్పుడే అన్నాను కాలర్ దించుకోకుండా సినిమాలు చేస్తానని. ఆరోజే మళ్లీ నటుడిగా పుట్టాను. మీకు మాట ఇచ్చినరోజే పుట్టాను. ఇప్పుడు కాలర్ ఎత్తుకునేలా సినిమాలు చేస్తున్నానని అనుకుంటున్నాను. కానీ విశ్వక్ మాత్రం అంత త్వరగా పరిణితి చెందాడా అనిపించింది. నటుడిగా బ్యాలెన్స్ చేయడం విశ్వక్‌కు చాలా త్వరగా బాగా కుదిరింది. దాస్ కా దమ్మీ నిజంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను." అని ఎన్టీఆర్ అన్నారు.
ఇదీ చూడండి:క్యూటీ స్మైల్‌లో అనుపమ.. డోంట్ కేర్ అంటున్న మృణాల్