తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఎన్టీఆర్​- కొరటాల చిత్రానికి ముహుర్తం ఫిక్స్!.. సెట్స్​పైకి అప్పుడే!! - ఎన్టీఆర్ కొత్త సినిమా

టాలీవుడ్​ స్టార్​ హీరో ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న కొత్త సినిమాకు సంబంధించి క్రేజీ అప్​డేట్​ వచ్చేసింది! సంక్రాంతి తర్వాత సెట్స్​పైకి ఈ సినిమా వెళ్లనున్నట్లు సమాచారం.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 19, 2022, 2:45 PM IST

NTR 30 Movie Update: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్​లో 'NTR 30' మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్‌' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకుంది. దీంతో ఆ హిట్‌ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ ప్రకటించి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ పట్టాలెక్కలేదు.

దీంతో ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఇటీవలే ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌ ట్రిప్‌కు వెళ్లారు. అయితే ఇప్పట్లో ఎన్టీఆర్‌ 30 మూవీ సెట్స్‌పైకి రానట్లేనా అంటూ అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొత్త సంవత్సరంలో ఈ మూవీ సెట్స్‌పైకి రానుందని తెలుస్తోంది.

ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సంక్రాంతికి కుదిరిందనీ, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉన్న తారక్‌ న్యూఇయర్‌ వేడుకలను అక్కడే జరుపుకోనున్నారట. ఎన్టీఆర్‌ వచ్చాక ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి తమిళ్‌ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు.

ఇదీ చదవండి:అందుకే 'సీతారామం'లో సీత పాత్రకు తెలుగు అమ్మాయిని తీసుకోలేదు: హను రాఘవపూడి

ABOUT THE AUTHOR

...view details